Team India: విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్.. ఆసీస్‌తో మ్యాచ్ కోసమేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Team India: టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఇటీవల ఆసియాకప్‌లో సెంచరీ చేసి ఫామ్‌లోకి వచ్చాడు. దీంతో మంగళవారం నుంచి ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లో అందరి కళ్లు కోహ్లీ బ్యాటింగ్‌పైనే ఉన్నాయి. అయితే తాజాగా నెట్స్‌లో విరాట్ కోహ్లీ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం చర్చనీయాంశంగా మారింది. మీడియం పేస్ బౌలింగ్ ప్రాక్టీస్ చేయడంతో ఆస్ట్రేలియాతో సిరీస్‌లో కోహ్లీ బౌలింగ్ కూడా చేస్తాడా అన్న ప్రశ్నలు మొదలయ్యాయి. ఆసియా కప్‌లో బౌలింగ్ వైఫల్యంతోనే టీమిండియా టోర్నీ నుంచి బయటకు వచ్చింది. ముఖ్యంగా ఆరో బౌలింగ్ ఆప్షన్ లేకపోవడం భారత్ అవకాశాలను దెబ్బతీసింది. జట్టులో దీపక్ హుడా ఉన్నా కెప్టెన్ రోహిత్ శర్మ వినియోగించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది.
Read Also:Live: టీచర్ కోసం ట్రైన్ ఆపేసిన స్టూడెంట్స్
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
ఈ నేపథ్యంలో త్వరలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా గెలవాలంటే జట్టులో పార్ట్ టైమ్ బౌలర్లు కూడా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. గతంలో సచిన్, గంగూలీ, సెహ్వాగ్, రైనా, యువరాజ్ లాంటి స్టార్ ఆటగాళ్లు పార్ట్ టైమ్ బౌలింగ్‌తో జట్టుకు సహాయపడేవాళ్లు. ప్రస్తుతం టాప్-6లో పార్ట్ టైమ్ బౌలింగ్ వేసే ఆటగాళ్లు లేకపోవడం టీమిండియాకు మైనస్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఎప్పుడో బౌలింగ్‌లో తళుక్కుమనే విరాట్ కోహ్లీ తాజాగా బౌలింగ్ ప్రాక్టీస్ చేయడం టీమిండియాకు శుభవార్త అనే భావించొచ్చు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో కోహ్లీ అరుదుగా బౌలింగ్ చేస్తుంటాడు. కాగా జట్టులో షమీ, ప్రసిద్ధ్ కృష్ణ, అవేష్ ఖాన్, సిరాజ్ లాంటి బౌలర్లు లేకపోవడంతో తానున్నానంటూ కోహ్లీ అభయహస్తం ఇస్తున్నాడని సోషల్ మీడియాలో నెటిజన్‌లు కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
-
Bank Strike: బ్యాంక్‌ల సమ్మె వేళ గుడ్ న్యూస్.. వాటికి ఛార్జీలు రద్దు.. SBI ఖాతాదారులకు భారీ ఊరట
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?