Virat Kohli: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో ఘనత సాధించాడు. అత్యధిక అంతర్జాతీయ పరుగులు సాధించిన భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ రికార్డును విరాట్ కోహ్లీ అధిగమించాడు. ద్రవిడ్ 504 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,064 పరుగులు చేయగా.. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 471 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 24,078 పరుగులు సాధించాడు. టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ మాత్రమే విరాట్ కోహ్లీ కన్నా ముందు నిలిచాడు. సచిన్ 664 అంతర్జాతీయ మ్యాచ్‌లు […]
APCPDCL: ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (ఏపీసీపీడీసీఎల్) ఉద్యోగులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కార్యాలయాల్లో మొబైల్ ఫోన్‌లు వాడొద్దంటూ ఉద్యోగులందరికీ మెమో జారీ చేసింది. అక్టోబరు 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. డిస్కంల ఉద్యోగులు పని వేళ్లలో సమయాన్ని వృథా చేస్తున్నారని, రోజువారీ పనిని వాయిదా వేస్తున్నారని ఈ నెల 19న విడుదల చేసిన మెమోలో ఏపీసీపీడీసీఎల్ సీఎండీ జె.పద్మాజనార్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పనిని వాయిదా వేయడం వల్ల పేరుకుపోతోందని అభిప్రాయపడ్డారు. పని […]
Magadheera: టాలీవుడ్‌లో ప్రస్తుతం రీ రిలీజ్ సినిమాల హవా నడుస్తోంది. కొత్త సినిమాల కంటే రీ రిలీజ్ సినిమాలకే ఎక్కువ కలెక్షన్స్ వస్తుండటం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరుస్తోంది. ఇటీవల మహేష్‌బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ జల్సా, చిరంజీవి ఘరానా మొగుడు సినిమాలకు సంబంధించి స్పెషల్ షోలు ప్రదర్శించారు. తాజాగా బాలయ్య చెన్నకేశవరెడ్డి సినిమా స్పెషల్ షోలు ప్రదర్శిస్తున్నారు. కొన్ని చోట్ల అయితే రెగ్యులర్ సినిమాగా చెన్నకేశవరెడ్డిని రోజుకు 4 ఆటలుగా ప్రదర్శిస్తూ వసూళ్లు దండుకుంటున్నారు. అంతేకాకుండా హాలీవుడ్ […]
ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారు ఏ పరిహారాలు చెల్లించుకోవాలి…? ఎవరు ఎలాంటి పూజలు చేస్తే మంచిది..? మంచి జరగాలంటే ఏం చేయాలి..? ఇలా పూర్తి వివరాలతో కూడిన ఇవాళ్టి రాశి ఫలాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=kGuUrlv6v_Y
Supreme Court: సుప్రీంకోర్టులో బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌కు ఊరట లభించింది. గుజరాత్ వడోదర రైల్వేస్టేషన్‌లో జరిగిన తొక్కిసలాట కేసును కొట్టివేయాలంటూ గతంలో గుజరాత్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తాజాగా సుప్రీంకోర్టు సమర్థించింది. ‘రాయిస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా షారూఖ్ తన చిత్రబృందంతో కలిసి 2017లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయనను చూసేందుకు వడోదర రైల్వే స్టేషన్‌కు పోటెత్తారు. షారూఖ్ వారిపై టీషర్టులు, స్మైలీ బాల్స్ విసిరారు. వీటిని చేజిక్కించుకునే ప్రయత్నంలో […]
IND Vs SA: ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ గెలుచుకున్న టీమిండియా జోరు మీద కనిపిస్తోంది. బుధవారం నుంచి సొంతగడ్డపై మరో టీ20 సిరీస్‌కు సిద్ధమవుతోంది. ఈ మేరకు దక్షిణాఫ్రికాతో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. అయితే ఈ సిరీస్‌కు సెలక్టర్లు ముందుగానే హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్‌కు విశ్రాంతి కల్పించారు. అటు కరోనా కారణంగా ఆసీస్‌తో సిరీస్‌కు దూరమైన షమీ దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఆల్‌రౌండర్ దీపక్ హుడా కూడా […]
• తిరుమల: నేటి నుంచి 9 రోజుల పాటు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు • నేడు, రేపు తిరుమలలో సీఎం జగన్ పర్యటన.. రాత్రి 7:45 గంటలకు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్.. నేడు అలిపిరి వద్ద ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించనున్న సీఎం జగన్.. రేపు ఉదయం 6 గంటలకు శ్రీవారిని దర్శించుకోనున్న జగన్.. స్వామి వారి దర్శనం తర్వాత పరకామణి భవనం ప్రారంభోత్సవం.. ఎంపీ వేమిరెడ్డి నిర్మించిన రెస్ట్ హౌస్‌ను ప్రారంభించనున్న జగన్ • […]
Flex Printers Association: ఏపీలో నవంబర్ 1 నుంచి ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై ప్రభుత్వం నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ ఫ్లెక్స్ ప్రింటర్స్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో ఫ్లెక్సీ పరిశ్రమపై ఆధారపడ్డ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమను స్మగ్లర్లుగా చూస్తోందని.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల 10 లక్షల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని అసిసోయేషన్ ఆవేదన వ్యక్తం చేసింది. Read Also: Ghulam Nabi Azad: […]
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ కోసం టీమిండియా క్రికెటర్లు హైదరాబాద్ వచ్చిన సంగతి తెలిసిందే. ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ అనంతరం పలువురు టీమిండియా క్రికెటర్లు మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. భారత స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాతో పాటు సూర్యకుమార్ యాదవ్ రామ్‌చరణ్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మ్యాచ్ గెలుపు సంబరాలను రామ్‌చరణ్ ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. అయితే దీనిపై మరింత సమాచారం తెలియాల్సి […]