• తిరుమల: నేడు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. రాత్రి 7 గంటలకు మాడవీధులలో ఊరేగనున్న సేనాధిపతి విశ్వక్సేనుడు.. రేపు శ్రీవారి ఆలయంలో గరుడ పఠం ప్రతిష్ట.. కంకణధారణ కార్యక్రమాలు.. బ్రహ్మోత్సవ కంకణధారణ చేయనున్న ఈవో ధర్మారెడ్డి, అర్చకులు
• విజయవాడ: ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి ఘనంగా దేవీ నవరాత్రులు.. 10 రోజుల పాటు 10 అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం.. నేడు స్వర్ణ కవచాలంకృత శ్రీకనకదుర్గ దేవిగా అమ్మవారి దర్శనం
• శ్రీశైలంలో నేటి నుంచి అక్టోబర్ 5 వరకు దసరా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు.. అమ్మవారి యాగశాల ప్రవేశంతో దసరా ఉత్సవాలకు శ్రీకారం.. వివిధ అలంకారాలలో దర్శనం ఇవ్వనున్న శ్రీభ్రమరాంబికాదేవి.. ప్రముఖులకు రోజుకు 3 సమయాల్లో దర్శనం
• నేడు ప్రకాశం జిల్లాలో మంత్రుల బృందం పర్యటన.. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రులు ఆదిమూలపు సురేష్, మేరుగ నాగార్జున, ఆర్కే రోజా
• గుంటూరు: నేటి నుంచి అక్టోబర్ 5 వరకు తెనాలి వైకుంఠపురం ఆలయంలో దసరా మహోత్సవాలు
• కాకినాడ: నేడు అన్నవరం సత్యదేవుడి ఆలయంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమం.. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 గంటల వరకు 08868-238127 నంబరుకు కాల్ చేసి భక్తులు సమస్యలు సూచనలు చెప్పవచ్చని అధికారుల సూచన
• మెదక్: నేటి నుంచి ఏడుపాయల వనదుర్గా భవానీ శరన్నవరాత్రి ఉత్సవాలు.. అక్టోబర్ 5 వరకు కొనసాగనున్న ఉత్సవాలు
• నిర్మల్ జిల్లా: బాసర శ్రీ జ్ఞాన సరస్వతి క్షేత్రంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ శారదీయ శరన్నవరాత్రి మహోత్సవాలు.. తొలిరోజు శైలపుత్రి అవతారంలో భక్తులకు అమ్మవారి దర్శనం.. కట్టెపొంగలి నివేదన