Soaps Prices: ధరల భారంతో అల్లాడుతున్న సామాన్యులకు ఊరట లభించింది. సబ్బులు, డిటర్జెంట్ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రముఖ ఎఫ్ఎంసీజీ కంపెనీ హిందుస్థాన్ యూనిలీవర్ ప్రకటించింది. ప్రొడక్ట్ బట్టి 2 నుంచి 19 శాతం మేర ధరలు తగ్గించినట్లు తెలిపింది. ముడిసరకు ధరలు అదుపులోకి రావడంతో ఈ తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సవరించిన ధరలు కలిగిన స్టాక్ నెలాఖరుకు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హిందూస్థాన్ యూనిలీవర్ విక్రయిస్తున్న సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్ 500 మిల్లీలీటర్ల […]
Vijayawada: విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ ఆలయాన్ని ఈనెల 25న మూసివేయనున్నారు. సూర్యగ్రహణం కారణంగా ఈనెల 25న ఆలయాన్ని మూసివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. సూర్యగ్రహణం సందర్భంగా ఈనెల 25న ఉదయం 10 గంటలకు అమ్మవారికి మహానివేదన, పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం ఆలయ ద్వారాలను అర్చకులు మూసివేస్తారని తెలిపారు. తిరిగి మరుసటి రోజు అమ్మవారి ఆలయ ద్వారాలను తెరవనున్నట్లు పేర్కొన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ అధికారులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. Read Also: […]
Mohammad Shami: టీమిండియా బౌలర్ మహ్మద్ షమీ చేసిన ఓ పోస్టుపై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోలింగ్స్ వస్తున్నాయి. దీంతో క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. దసరా సందర్భంగా తన అభిమానులకు ట్విట్టర్ వేదికగా మహ్మద్ షమీ శుభాకాంక్షలు తెలిపాడు. ‘దసరా పర్వదినాన శ్రీ రాముడు మీ జీవితంలోని కోరికలను అన్నింటినీ నెరవేర్చాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మీ జీవితంలో సంతోషం, సంపద, విజయం అందించాలని నేను […]
Andhra Pradesh: ఏపీలో పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కేటాయిస్తూ, పలువురు ఐఏఎస్‌లను బదిలీలు చేస్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ శనివారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ డైరెక్టర్‌గా విజయసునీత.. గ్రామ, వార్డు, సచివాలయాల అడిషనల్ డైరెక్టర్‌గా భావన.. శ్రీకాకుళం జేసీగా నవీన్.. పార్వతీపురం ఐటీడీఏ పీవోగా విష్ణుచరణ్.. మిడ్ డే మీల్స్ డైరెక్టర్‌గా నిధి మీనా.. ఏపీ సీఆర్‌డీఏ అడిషనల్ కమిషనర్‌గా కట్టా సింహాచలం బదిలీ అయ్యారు. Read Also: […]
Team India: టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే సీనియర్ ఆటగాళ్లు రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా వంటి కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కాగా.. తాజాగా మరో కీలక ఆల్‌రౌండర్ దీపక్ చాహర్ కూడా దూరమయ్యాడు. చీలమండ గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో తొలి వన్డేకు దూరమైన దీపక్ చాహర్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి వెళ్లినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో దక్షిణాఫ్రికాతో మిగతా రెండు వన్డేల నుంచి అతడు తప్పుకున్నాడు. […]
JC Prabhakar Reddy: బీఎస్ 3 వాహనాలను బీఎస్ 4 వాహనాలుగా మార్చి రిజిస్ట్రేషన్ చేసిన కేసులో జేసీ ప్రభాకర్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేయగా.. శుక్రవారం నాడు జేసీ ప్రభాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ఈడీ ముందు హాజరయ్యారు. గతంలో అశోక్ లేల్యాండ్ నుంచి ఆయన కొనుగోలు చేసిన వాహనాల విషయంలో జరిగిన లావాదేవీలపై ఈడీ సోదాలు జరిగాయి. అయితే కొద్ది కాలం క్రితమే జేసీ కుటుంబం తమ ప్రైవేటు బస్సుల వ్యాపారాన్ని నిలిపివేసింది. తాజాగా ఈడీ కార్యాలయంలో […]
Tirumala: తిరుమల శ్రీవారి ఖాజానాకు నిత్యం విరాళాల రూపంలో కానుకలు అందుతూనే ఉంటాయి. ప్రతిరోజు కోట్ల రూపాయలలో శ్రీవారి హుండీకి ఆదాయం సమకూరుతుంది. ఇది కాకుండా శ్రీవారి ట్రస్టుకు దానధర్మాలు ఇచ్చే దాతలు కూడా ఉంటారు. వారు వస్తు లేదా ధన రూపేణా విరాళాలను టీటీడీకి అందజేస్తుంటారు. తాజాగా శ్రీవారి ఖజానాలో వాహనం కూడా చేరిపోయింది. హర్ష టయోటా షోరూం ఎండీ ఎం.హర్షవర్ధన్ వెంకటేశ్వరస్వామికి టయోటా రైడర్ కారును విరాళంగా సమర్పించారు. శుక్రవారం నాడు ఆలయం వద్దకు […]
BCCI: ఈనెల 18తో బీసీసీఐ అధ్యక్ష, కార్యదర్శుల పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్తగా ఎవరిని ఎన్నుకుంటారనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రస్తుత కార్యదర్శి, కేంద్రమంత్రి అమిత్ షా కుమారుడు జై షా తదుపరి బీసీసీఐ అధ్యక్షుడు అని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా మరో కొత్త పేరు తెరపైకి వచ్చింది. టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ రోజర్ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశంలో కర్ణాటక […]
Dharmana Prasad Rao: విశాఖ రాజధాని విషయంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో సీఎం జగన్ అనుమతిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు మంత్రి ధర్మాన తెలిపారు. విశాఖ మన రాజధాని కావాలని, పిల్లల భవిష్యత్ కోసం ఉద్యమం చేపట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తనకు ఉద్యమంలోకి వెళ్లాలన్న ఆలోచన ఉందని.. అందుకే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ధర్మాన స్పష్టం చేశారు. మరోవైపు అమరావతి రైతుల […]