‘క్రాక్’ సినిమాతో అటు రవితేజకు ఇటు చిత్ర పరిశ్రమకు ఊపు తెచ్చిన దర్శకుడు మలినేని గోపీచంద్. కరోనా తర్వాత నిస్సత్తువగా సాగుతున్న తెలుగు చిత్రపరిశ్రమకు ‘క్రాక్’ గొప్ప ఊపిరి పోసింది. ఇళ్ళకే పరిమితమైన ప్రేక్షకులను 50 శాతం ఆక్యుపెన్సీతో ఫుల్ చేసిన సినిమా ఇది. ఆ తర్వాత ఇప్పటి వరకూ ఇండియాలో తెలుగు చిత్రపరిశ్రమదే ముందడుగు. ఈ రోజున 80 సినిమాలు షూటింగ్ లో ఉన్నాయంటే వాటికి ‘క్రాక్’ ఇచ్చిన భరోసానే కారణం. ఇక విషయానికి వస్తే […]
ప్రముఖ దర్శకుడు శంకర్ కు ‘అన్నియన్’ (అపరిచితుడు) నిర్మాత ఆస్కార్ రవిచంద్రన్ లీగల్ నోటీస్ పంపారు. ఇటీవల రణ్‌వీర్ సింగ్ హీరోగా శంకర్ హిందీలో అన్నియన్ సినిమాను రీమేక్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తన అనుమతి లేకుండా తాను నిర్మించిన ‘అన్నియన్’ సినిమాను హిందీలో రీమేక్ చేస్తామని ప్రకటించటం పై రవిచంద్రన్ శంకర్ కు లీగల్ నోటీస్ ను పంపినట్లు సమాచారం. తను హిందీ రీమేక్ ప్రకటన వినగానే షాక్ అయ్యానని, అన్నియన్ పూర్తి […]
మిల్కీ బ్యూటీ తమన్నాకు, స్టార్ హీరోయిన్ కాజల్ కు మధ్య చక్కని స్నేహం ఉంది. అందుకే కాజల్ నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమన్నా సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించింది. ప్రభుదేవాతో ‘గులేబకావళి’, జ్యోతికతో ‘జాక్ పాట్’ చిత్రాలను రూపొందించిన కళ్యాణ్ ఇప్పుడు కాజల్ నాయికగా ఉమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఈ హారర్ ఫాంటసీ డార్క్ కామెడీ మూవీలో యోగిబాబు, ఊర్వశి, దేవదర్శిని, […]
మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. సైక్లింగ్ అంటే ఇష్టమైన సోనూ… పొద్దునపొద్దునే ఇటు వ్యాయామంతో పాటు అటు ప్రయాణం కూడా చేసేశాడన్న మాట!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘పుష్ప’. తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ, హిందీ బాషల్లో భారీ స్థాయిలో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో ఆ అంచనాలు రెట్టింపు అయ్యాయి. రశ్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, ధనుంజయ్ ముఖ్యపాత్రధారులు. ఇక ఈ సినిమాలో మలయాళ స్టార్ […]
చిరంజీవి ఆ మధ్య తనకు కరోనా వచ్చిందని, తనను కలిసిన వాళ్ళంతా పరీక్షలు చేయించుకోమని ప్రకటించారు. అయితే… ఎలాంటి అనారోగ్య లక్షణాలు రెండు మూడు రోజులైనా కనిపించకపోవడంతో ఆయన మళ్ళీ మరో రెండు చోట్ల టెస్టులు చేయించుకుంటే కరోనా సోకలేదని తెలిసింది. దాంతో తిరిగి ఈ విషయాన్ని జనానికి సోషల్ మీడియా మీద తెలియచేశారు. తాజాగా ఇలాంటి సంఘటనే ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ విషయంలోనూ జరిగింది. సమంత నాయికగా ఆయన దాదాపు ఇరవై రోజులుగా ‘శాకుంతలం’ సినిమాను […]
ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ చేస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గోండు వీరుడు కొమురం భీం పాత్రలో అలరించనున్నాడు. అంతేకాదు ఎన్టీఆర్ తెలంగాణ యాసలో ఇరగదీయనున్నాడట. ఈ సినిమాను రాజమౌళి పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌కు ఫిక్షన్ జోడించి తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ దర్శకుడు కొరటాలతో సినిమా చేయనున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. సినిమా […]
తెలుగమ్మాయి అంజలి ‘వకీల్ సాబ్’తో నిలదొక్కుకున్నట్లేనా!? గతంలో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’తో ఓ వేవ్ లా టాలీవుడ్ ని తాకింది అంజలి. అంతకు ముందు చిన్న చిన్న సినిమాల్లో నటించినా… ఆ సినిమా ఒక్కసారిగా స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టింది. అప్పటికే తమిళనాట కూడా స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది అంజలి. అయితే వ్యక్తిగత జీవితంలో ఒడిదుడుకులతో కెరీర్ ని సక్సెస్ ఫుల్ గా కొనసాగించలేక పోయింది. మధ్యలో కొన్ని సినిమాల్లో మెరిసినా మునుపటి ఫామ్ అందిపుచ్చుకోలేక […]
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కీలక పాత్ర పోషించిన ‘గమనం’ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘మనుచరిత్ర’, ‘చేతక్ శీను’ చిత్రాలలో కథానాయకుడిగా శివ కందుకూరి నటిస్తున్నాడు. తాజాగా అతనితో సినిమాను నిర్మించబోతున్నట్టు యువ వ్యాపారవేత్త సురేశ్ రెడ్డి కొవ్వూరి ప్రకటించారు. పి19 ఎంటర్ టైన్ మెంట్ లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ […]
ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీయార్ 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్టు తాజా ప్రకటన వెలువడింది. […]