తమన్నా ఆవిష్కరించిన కాజల్ ‘ఘోస్టీ’ ఫస్ట్ లుక్!
By ramakrishna
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మిల్కీ బ్యూటీ తమన్నాకు, స్టార్ హీరోయిన్ కాజల్ కు మధ్య చక్కని స్నేహం ఉంది. అందుకే కాజల్ నటించిన తమిళ చిత్రం ‘ఘోస్టీ’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను తమన్నా సోషల్ మీడియా ద్వారా ఆవిష్కరించింది. ప్రభుదేవాతో ‘గులేబకావళి’, జ్యోతికతో ‘జాక్ పాట్’ చిత్రాలను రూపొందించిన కళ్యాణ్ ఇప్పుడు కాజల్ నాయికగా ఉమెన్ సెంట్రిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో కాజల్ పోలీస్ అధికారిణిగా నటిస్తోంది. ఈ హారర్ ఫాంటసీ డార్క్ కామెడీ మూవీలో యోగిబాబు, ఊర్వశి, దేవదర్శిని, శ్రీమాన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తనను ఇబ్బంది పెట్టే దెయ్యాలను ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా దానికి తెచ్చిందన్నదే ఈ చిత్రకథ. సామ్ సిఎస్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాను తెలుగులోనూ ‘ఘోస్టీ’ పేరుతో విడుదల చేయబోతున్నారు నిర్మాతలు సుదర్శన్ సుందరమ్, జి. జయరాం.
Also Read
తాజావార్తలు
ట్రెండింగ్
-
Indonesia: దొంగతనానికి వచ్చి ‘మమ్మీ’లుగా మారిపోయారు.. వైరల్ వీడియో
-
Instagram: ఇంస్టాగ్రామ్కు కేంద్రం నోటీసులు.!
-
Smoking While Drinking Tea: ‘టీ’తో పాటు ‘సిగరెట్’ తాగుతున్నారా.? ఆ రోగాలకు రెడ్ కార్పెట్ పరిచినట్లే.!
-
Home Tips : ఇంట్లోకి తేళ్లు రాకుండా ఉండాలా.? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
14 రోజుల బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో HUAWEI Band 11 సిరీస్ భారత్‌లో లాంచ్..!