మొన్న తమిళనాడు ఎన్నికల సమయంలో స్టార్ హీరో విజయ్ ఓటు వేయడానికి సైకిల్ మీద వెళ్ళడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిపోయింది. తాజాగా అదే ఫీట్ ను ఇప్పుడు ప్రముఖ నటుడు సోనూసూద్ చేశాడు. అయితే దీనికి కారణం వేరు. ‘ఆచార్య’ సినిమా షూటింగ్ స్పాట్ కు పొద్దున్నే వెళ్ళాల్సి రావడంతో సోనూసూద్ సైకిల్ మీద వెళ్ళిపోయాడట. సైక్లింగ్ అంటే ఇష్టమైన సోనూ… పొద్దునపొద్దునే ఇటు వ్యాయామంతో పాటు అటు ప్రయాణం కూడా చేసేశాడన్న మాట!