స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమా రూపొందుతోంది. హీరోయిన్ గా అందాల భామ రష్మిక మందన నటిస్తుంది. కాగా, కరోనా అడ్డంకులను తట్టుకొని ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణ జరుపుకుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమాపై భారీగా అంచనాలు పెంచాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమా షూటింగులో విలన్ పాత్రధారి ఫహాద్ ఫాజిల్ పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ పుష్ప షూటింగ్ లో […]
దర్శకుడు సుకుమార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘రంగస్థలం’. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో సమంత కథానాయికగా నటించగా.. జగపతిబాబు, ప్రకాష్ రాజ్, అనసూయ, ఆది పినిశెట్టి కీలక పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇదిలావుంటే, ‘రంగస్థలం’ తమిళ డబ్బింగ్ వెర్షన్ ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో శ్రీరామనవమి పురస్కరించుకొని తాజాగా ‘రంగస్థలం’ తమిళ ట్రైలర్‌ని విడుదల చేశారు. చెవిటి పాత్రకు ప్రాణం పోసిన చిట్టిబాబు తమిళంలో […]
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు ఎక్కువగా సొషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన హాట్ ఫోటో షూట్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ అందాల […]
ఐపీఎల్ సీజన్ 2021 లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాణిస్తోంది. ఏబీ డివిలియర్స్, మ్యాక్స్‌వెల్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. కాగా, ఇదే మ్యాక్స్‌వెల్ గత కొన్ని సీజన్ల నుంచి పంజాబ్ తరఫున రాణించలేకపోయాడు. ప్రస్తుత ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ మ్యాక్స్‌వెల్ చెలరేగిపోయాడు. ఆర్సీబీ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ఈ సీజన్లో ఆర్సీబీ తరఫున 3 మ్యాచుల్లోనే 176 పరుగులు చేశాడు. ఇదే మ్యాక్స్‌వెల్ పంజాబ్ తరఫున పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటకట్టుకోగా.. […]
కార్తికేయ, లావణ్య త్రిపాఠి హీరోహీరోయిన్లుగా రూపొందించిన చిత్రం ‘చావు కబురు చల్లగా’. జిఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీవాస్ నిర్మించిన ఈ చిత్రాన్ని పెగళ్లపాటి కౌళిక్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత బాగా ఆడలేకపోయింది. కాగా ఈ సినిమా ఏప్రిల్ 23న ఓటీటీ ఆహాలో విడుదలవుతుంది. ఓటీటీ కోసం ఈ చిత్రాన్ని రీఎడిట్ చేసినట్లు చిత్ర దర్శకుడు కౌశిక్ తెలిపారు. ఆయన అనుకున్న పాయింట్ […]
తమ తదుపరి చిత్రంగా మొదలయ్యేది ‘ఐకాన్’ అని స్పష్టం చేశాడు దిల్ రాజు. ‘వకీల్ సాబ్’ సక్సెస్ మీట్ లో ఈ విషయాన్ని చెబుతూ ‘వ్యక్తిగతంగా ఈ స్ర్కిప్ట్ కి బాగా కనెక్ట్ అయ్యాను. వేణుశ్రీరామ్ చెప్పిన లైన్ బాగా నచ్చింది. దానిని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా రెడీ చేశాం. ఇక మొదలు పెట్టడమే తరువాయి’ అంటున్నారు. అప్పటలో కొన్ని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ ను కొంచెం వెనక్కి జరపవలసి వచ్చిందని ఇప్పుడు ఇక […]
అనసూయ భరద్వాజ్, అశ్విన్ విరాజ్ జంటగా రమేశ్ రాపర్తి దర్శకత్వంలో మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్న ‘థ్యాంక్యూ బ్రదర్’ రిలీజ్ పోస్టర్ ను అక్కినేని నాగచైతన్య తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ సినిమా ట్రైలర్ ఎంతో ఆసక్తి కరంగా ఉందని, కొత్త కాన్సెప్ట్ తో తీసిన ఈ సినిమా పట్ల తానెంతో ఆకర్షితుడైనట్లు చెబుతూ ఈ నెల 30న వరల్డ్ వైడ్ థియేటర్లలో విడుదల కానున్నట్టు తెలిపాడు చైతు. ఈ […]
విక్టరీ వెంకటేశ్, మీనా జంటగా ‘దృశ్యం2’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. జీతూ జోసెఫ్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి వెంకటేశ్ తన షూట్‌ను పూర్తి చేసుకున్నారు. కాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నారనే వార్త టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తోంది. ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట చిత్ర బృందం.కరోనా కారణంగా మలయాళ చిత్రం ‘దృశ్యం2’ను ఓటీటీలోనే […]
అల్లు శిరీష్ చేసిన ఇండీ మ్యూజిక ఆల్బమ్ ‘విలయాటి షరాబ్’ గత మార్చి 24న విడుదలై యూట్యూబ్ లో దుమ్ము రేపుతోంది. దర్శన్ రావల్ నీతి మోహన్ పాడిన ఈ మ్యూజిక్ వీడియోను అల్లు శిరీష్, హేలీ దారువాలపై చిత్రీకరించారు. ఈ వీడియోకు యుట్యూబ్ లో 100 మిలియన్ వ్యూస్ లభించాయి. ఇప్పటి వరకూ ఆరు సినిమాల్లో హీరోగా నటించినా రాని గుర్తింపు శిరీష్ కి ఈ వీడియో ఆల్బమ్ ద్వారా లభించటం విశేషం. తన సోదరుడు […]
మహేశ్ హీరోగా నటిస్తున్న ‘సర్కారువారి పాట’ అనుకున్న టైమ్ కంటే ముందుగానే విడుదల కాబోతోందా? అంటే అనుననే అంటున్నాయి సినిమా వర్గాలు. ఇటీవల కాలంలో బడా హీరోల సినిమాల విషయంలో పలు మార్పులు చేర్పులు చోటుచేసుకుంటున్నాయి. అందులో భాగంగా మహేశ్ నటిస్తున్న ‘సర్కారువారి పాట’ ముందు అనుకున్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతికి కాకుండా ఈ ఏడాది దసరా తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తుందట. ఆ వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాను మొదలెట్టి 2022 సమ్మర్ కి వచ్చేలా […]