ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కీలక పాత్ర పోషించిన ‘గమనం’ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘మనుచరిత్ర’, ‘చేతక్ శీను’ చిత్రాలలో కథానాయకుడిగా శివ కందుకూరి నటిస్తున్నాడు. తాజాగా అతనితో సినిమాను నిర్మించబోతున్నట్టు యువ వ్యాపారవేత్త సురేశ్ రెడ్డి కొవ్వూరి ప్రకటించారు.
పి19 ఎంటర్ టైన్ మెంట్ లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా చవన్ ప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. జూన్ నెల నుంచి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా నిర్మాత సురేష్ రెడ్డి కొవ్వూరి మాట్లాడుతూ “శివ కందుకూరి పాత్ర సినిమా మెయిన్ పిల్లర్స్ లో ఒకటి. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్రలో అతను కనిపిస్తారు. సీతారామ్ ప్రసాద్ మంచి కథ చెప్పారు. దానికి చవన్ ప్రసాద్ న్యాయం చేయగలుగుతారని అతడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం. ఈ సినిమాకు ‘జాతిరత్నాలు’ ఫేమ్ సిద్ధం మనోహర్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు. ‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ తదితర హిట్ సినిమాలకు ఎడిటింగ్ చేసిన గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ చేయనున్నారు. పలు హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించిన శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. మంచి టెక్నికల్ టీమ్ కుదిరింది. హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు త్వరలో వెల్లడిస్తాం. జూన్ నెల నుంచి హైదరాబాద్ లో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తాం. కొడైకెనాల్ లో మరో షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నాం” అని అన్నారు.