దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోడీ సర్కారును ఉద్దేశిస్తూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు. కరోనా థర్డ్ వేవ్ కూడా వచ్చే ప్రమాదముందని వివిధ దేశాలు హెచ్చరిస్తున్న తరుణంలో మోడీ సర్కార్ పై రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా థర్డ్ వేవ్ అడ్డుకునేందుకు మోదీ ప్రభుత్వం చేపట్టిన సన్నాహక చర్యలు, కార్యచరణపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా మూడో వేవ్ చిన్నపిల్లలపై ప్రభావం చూపుతుందని వార్తలు […]
విశేష్ ఫిల్మ్స్… ఈ బ్యానర్ పేరు బాలీవుడ్ ప్రేక్షకులకు బాగానే తెలుసు. ఎందుకంటే, ఈ బ్యానర్ వెనుక ఉన్నది ముఖేష్ భట్, మహేశ్ భట్. వీరిద్దరి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పేదేముంది? మరీ ముఖ్యంగా, మహేశ్ భట్ దర్శకుడిగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తీశాడు. అతని చాలా సినిమాలు అన్న ముఖేశ్ భట్ ‘విశేష్ ఫిల్మ్స్’ బ్యానర్ పైనే రూపొందించాడు. అయితే, 2021 ప్రారంభంలో భట్ బ్రదర్స్ విడిపోయారు. విశేష్ ఫిల్మ్స్ తో మహేశ్ భట్ ఇక […]
నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండలో ఓ యువకుడు చెట్టుపై ఐసోలేషన్ లో ఉండటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము. మరి ఐసోలేషన్ లో అంటే ఎక్కడ ఉండాలనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో ఇంటి ముందున్న చెట్టు కనిపించింది. అంతే, దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టి అక్కడే ఉంటున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 12 […]
కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మేన్‌గా పని చేసిన గంగాధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరో శివాజీకి వ్యక్తిగత మేకప్ మెన్ గా, లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో చీఫ్ మేకప్ మెన్ గానూ పనిచేసిన ఆయన.. నంది అవార్డు కూడా అందుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడతో […]
లక్కీ గర్ల్ రష్మిక మందన ప్రస్తుతం అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె ఓ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. దీంతో పాటు.. బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్‌తో ఓ సినిమా, సిద్ధార్త్ మల్హోత్రా ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మిషన్ మంజు’ అనే సినిమాల్లో ఆమె నటిస్తోంది. ఇదిలావుంటే, కన్నడ సినిమా ‘కిరిక్ పార్టీ’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన రష్మిక.. ఈ సినిమా హిందీ రీమేక్ కోసం ఆమెను […]
క్రమంగా… సినిమాల రేంజులోనే… టీవీ షోస్, ఓటీటీ షోస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. అయితే, త్వరలో చాలా అమెరికన్ షోస్ తమ లాస్ట్ సీజన్ తో అలరించి ఆడియన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాయి. యూఎస్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమాలకి ప్రపంచ వ్యాప్తంగానూ చాలా మంది అభిమానులున్నారు.నెట్ ఫ్లిక్స్ లో దుమారం రేపిన క్రైమ్ థ్రిల్లర్ షో ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 తరువాత ముగియనుంది. ఇప్పటికే ‘మనీ హెయిస్ట్’ టీమ్ చివరి […]
ప్రముఖ నిర్మాత ‘స్రవంతి’ రవికిశోర్, హీరో రామ్ ఇంట విషాదం చోటు చేసుకుంది. రవికిశోర్ తండ్రి, రామ్ తాతయ్య పోతినేని సుబ్బారావుగారు అనారోగ్య సమస్యలతో మంగళవారం (ఈ రోజు) ఉదయం విజయవాడలో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 91 సంవత్సరాలు. తాతయ్య మరణంతో రామ్ భావోద్వేగానికి లోనయ్యారు. తమ కుటుంబం ఈస్థాయికి రావడం వెనుక తాతయ్య కృషి, శ్రమను ఆయన గుర్తు చేసుకున్నారు. ‘స్రవంతి’ రవికిశోర్ సోదరుడు మురళి కుమారుడు రామ్ అనే సంగతి తెలిసిందే.రామ్ మాట్లాడుతూ […]
గత యేడాది కంటే ఈ సంవత్సరం కరోనా ప్రభావం తీవ్రంగా ఉండటంతో వేలాది మంది థియేటర్ల యాజమాన్యం సొంత నిర్ణయంతోనే వాటిని మూసేశారు. సినిమా షూటింగ్స్ దాదాపు ఎక్కడి కక్కడ నిలిచిపోయాయి. విడుదల అనే మాట కూడా ఎక్కడా వినిపించడం లేదు. ఈ నేపథ్యంలో రెండేళ్ల క్రితంతో పోల్చితే ఈ సారి లాభాల్లో భారీ కోత పడే ఛాయలు కనిపిస్తున్నాయి. 2020 తొలి త్రైమాసికంలో బాలీవుడ్ చిత్రసీమ వసూళ్ళు 1150 కోట్ల రూపాయలు ఉండగా, గత యేడాదిలో […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 లాంటి విభిన్నమైన ప్రేమ కథలను తెరకెక్కించిన దర్శకుడు సుకుమార్ ప్రస్తుతం పుష్ప సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతుందని ఇటీవల ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన రవిశంకర్ స్పష్టం చేశారు. అయితే ఈ మూవీ రెండో భాగానికి ఓ ప్రత్యేకమైన టైటిల్‌ను పెట్టాలని చిత్రబృందం ఆలోచిస్తుందని తెలిసింది. త్వరలోనే కొత్త పేరును ఖరారు చేసి అధికారికంగా ప్రకటిస్తారట. కరోనా […]
సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. అక్కడ వరుస విజయాలను చూసిన సుధాకర్ కు తమిళనాట ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. దాంతో ఓ రాజకీయ పార్టీ సుధాకర్ ను తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయమని కోరింది. అయితే, సుధాకర్ కు రాజకీయాల కంటే […]