క్రమంగా… సినిమాల రేంజులోనే… టీవీ షోస్, ఓటీటీ షోస్ కూడా క్రేజ్ సంపాదించుకుంటున్నాయి. అయితే, త్వరలో చాలా అమెరికన్ షోస్ తమ లాస్ట్ సీజన్ తో అలరించి ఆడియన్స్ కు గుడ్ బై చెప్పబోతున్నాయి. యూఎస్ లో సూపర్ సక్సెస్ అయిన ఈ కార్యక్రమాలకి ప్రపంచ వ్యాప్తంగానూ చాలా మంది అభిమానులున్నారు.
నెట్ ఫ్లిక్స్ లో దుమారం రేపిన క్రైమ్ థ్రిల్లర్ షో ‘మనీ హెయిస్ట్’ సీజన్ 5 తరువాత ముగియనుంది. ఇప్పటికే ‘మనీ హెయిస్ట్’ టీమ్ చివరి సీజన్ షూటింగ్ కూడా పూర్తి చేసింది. ఇరవై ఏళ్లుగా అమెరికన్స్ ని అలరిస్తోన్న టీవీ రియాల్టీ షో ‘కీపింగ్ అప్ విత్ కర్దాషియన్స్’ కూడా ‘ది ఎండ్’కు వచ్చేసింది. ఇరవయ్యవ సీజన్ తో ఈ లెజెండ్రీ షో చరిత్రగా మారనుంది.
‘ఎలెన్ డీజెనరెస్’ షో కూడా యూఎస్ లో ఎంతో పాప్యులర్! కానీ, 19వ సీజన్ తో తన షోని ముగించేయబోతోంది… హోస్ట్ ఎలన్. మరో సక్సెస్ ఫుల్ అమెరికన్ టాక్ షో ‘కానన్ ఓబ్రెయిన్స్’ చర్చ కార్యక్రమం కూడా 10వ సీజన్ తో త్వరలో ముగిసిపోతోంది. నెట్ ఫ్లిక్స్ లో డెడ్ ఎండ్ కి వచ్చేసిన హైలీ వాచ్డ్ షో ‘ఓజార్క్’. మంచి విజయం సాధించినప్పటికీ 4వ సీజన్ తో 2022లో ఇది పూర్తికానుంది.
2021 చివరి కల్లా మరో రెండు ఫేవరెట్ టీవీ షోస్ బుల్లితెరకు గుడ్ బై చెప్పేస్తున్నాయి. అవే ‘బెటర్ కాల్ సాల్’, ‘లాస్ట్ ఇన్ స్పేస్’. ‘బెటర్ కాల్’ 6వ సీజన్ ప్రసారం కావాల్సి ఉంది. సైన్స్ ఫిక్షన్ షో ‘లాస్ట్ ఇన్ స్పేస్’ మూడవ, ఆఖరి సీజన్ జనం ముందుకు రాబోతోంది.