గాయనిగా కెరీర్ ప్రారంభించిన ఆండ్రియా ఆ తర్వాత నటిగా మారిన సంగతి తెలిసిందే. ‘యుగానికి ఒక్కడు’ ‘తడాఖా’ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కాగా ఇటీవలే ఆండ్రియాకు కరోనా సోకింది. రెండు వారాల తరువాత ఆమె కోలుకున్నారు. అయితే కరోనా బారినపడే వారికి ఆమె కొన్ని సూచనలు చేస్తున్నారు. కరోనా అనే భయం మనస్సులో నాటుకుపోతే మరింతగా కుంగదీస్తున్నారు. భయం అనే పదానికి చోటివ్వరాదని ఆమె సూచించారు. కరోనా వైరస్ గురించి వచ్చే నెగిటివ్ వార్తలను […]
నటి పావలా శ్యామల దీన స్థితిని చూసి మెగాస్టార్ చిరంజీవి మరోసారి సాయం చేశారు. గతంలో పావల శ్యామల సరైన ఉపాధి లేక తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పుడు చిరంజీవి 2లక్షలు రూపాయలు సాయపడిన సంగతి తెలిసిందే. కుమార్తె శ్రీజ చేతులమీదుగా ఈ సాయం చేశారు. తాజాగా ఆమె పరిస్థితిపై వస్తున్న వార్తలు చూసిన చిరు మరోసారి ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమెకు రూ. 1 లక్షా 1500 లను అందించారు. అంతేకాదు ‘మా’ సభ్యత్వం ఇప్పించి, ఆమెకు […]
ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.
కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా.. మృతుల సంఖ్య కూడా భారీగానే పెరుగుతోంది. ఈ సమయంలో కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపీలు గోమూత్రం తాగడం వల్ల ప్రయోజనం ఉంటుందంటూ చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్ నేత జైవీర్ షెర్గిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నారుల వైద్య సేవల కోసం కేంద్రం ఏదైనా కార్యనిర్వహక దళాన్ని ఏర్పాటు చేసిందా.. అని ట్విట్టర్ ద్వారా జైవీర్ షెర్గిల్ ప్రశ్నించారు. డార్క్ […]
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో […]
క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’.. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్ […]
టైటానిక్ సినిమాలో లవర్ బాయ్ గా కనిపించి ప్రపంచాన్ని ఆకట్టుకున్న లియానార్డో డికాప్రియో తరువాత ఎన్నో అవార్డ్ విన్నింగ్ మూవీస్ చేశాడు. అక్లెయిమ్డ్ పర్ఫామెన్స్ తో సత్తా చాటాడు. ప్రస్తుతం ఆయన హాలీవుడ్ లో బిగ్ ఐకాన్. అందుకే, తన క్రేజ్ అండ్ కరెన్సీతో ఓ ఆదర్శవంతమైన పని చేయటానికి పూనుకున్నాడు!లియనార్డో ‘రీవైల్డ్’ అనే సంస్థతో కలసి వన్య ప్రాణుల రక్షణకి నడుం బిగించాడు. ఊరికే మాటలు చెప్పి, నినాదాలు ఇవ్వటం కాకుండా తన జేబులోంచి 43 […]
బాలీవుడ్ బిగ్ స్టార్స్ కి కరోనా లాక్ డౌన్స్ బలమైన పాఠాల్నే నేర్పుతున్నాయి. పోయిన ఏడాది ఫస్ట్ లాక్ డౌన్ లో అక్షయ్ కుమార్ సహా చాలా మంచి స్టార్స్ తమ సినిమాలతో ఓటీటీ వేదికలపైకి వచ్చేశారు. లాభనష్టాలు ఎలా ఉన్నా థియేటర్లు లేకపోవటంతో ఇంటర్నెట్ ద్వారా ఇంటింటికి వచ్చేయటమే బెటర్ అని బాలీవుడ్ భావించింది. అయితే, 2020 తరువాత 2021లో కూడా కరోనా ఇంకా షాకిస్తూనే ఉంది. అందుకే, మళ్లీ బాలీవుడ్ కి ఓటీటీ బాట […]
‘స్నేక్ ఐస్’… 2021, జూలై 23న రాబోతోన్న మరో క్రేజీ సీక్వెల్. హాలీవుడ్ లో మార్షల్ ఆర్ట్స్ కి ఉండే డిమాండ్ ఏంటో మనకు తెలిసిందే. అందుకే, ‘స్నేక్ ఐస్’ ఫ్రాంఛైజ్ జపాన్ కు సంబంధించిన నింజా సాహస కృత్యాల్ని నమ్ముకుంటుంది. త్వరలో జనం ముందుకు రానున్న లెటెస్ట్ ఇన్ స్టాల్మెంట్ పై ఫ్యాన్స్ లో చాలా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందుకు తగ్గట్టే ట్రైలర్ కూడా యాక్షన్ సీన్స్ తో ఆకట్టుకుంటోంది. అయితే, ఫిల్మ్ మేకర్స్ […]
దేశంలో కరోనా కల్లోలానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. రోజు రోజుకు కేసులు, మృతుల సంఖ్య ప్రభుత్వాలకు సవాల్ విసురుతూనే ఉంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కాగా కర్ణాటకలోని విజయపుర జిల్లా తొరవి గ్రామంలో కరోనా రెండో దశ మొదలైన నాటి నుంచి 70 మంది కొవిడ్ కాటుకు బలయ్యారు. అందులో 40 మంది ఒక్క నెలలోనే కరోనాతో చనిపోవడం ఆ గ్రామాన్ని కలవరపెడుతుంది. మాజీ మంత్రి ఎమ్బీ పాటిల్ […]