రచ్చ గెలిచి… ఇంటికొచ్చిన సుధాకర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సుధాకర్ వాచకం, అభినయం విలక్షణంగా ఉండి పలు చిత్రాల్లో నవ్వులు పూయించాయి. కొన్ని చిత్రాలలో హీరోగానూ, విలన్ గానూ నటించి ఆకట్టుకున్నారు సుధాకర్. చిత్రమేమంటే మాతృభాష తెలుగులో కంటే ముందుగానే తమిళనాట హీరోగా విజయకేతనం ఎగురవేశారు సుధాకర్. అక్కడ వరుస విజయాలను చూసిన సుధాకర్ కు తమిళనాట ఓ స్పెషల్ ఫాలోయింగ్ ఉండేది. దాంతో ఓ రాజకీయ పార్టీ సుధాకర్ ను తమ పార్టీకి మద్దతుగా ప్రచారం చేయమని కోరింది. అయితే, సుధాకర్ కు రాజకీయాల కంటే నటనలోనే రాణించాలనే అభిలాష ఉండేది. అందువల్ల ఆ పార్టీ వారి కోరికను సుధాకర్ అంగీకరించలేదు. దాంతో తమిళనాట సుధాకర్ కెరీర్ పై దుష్ప్రభావం చూపింది. అంతకు ముందు మాతృభాషలో కొన్ని చిత్రాలలో నటించినా, తమిళనాట హీరోగా కొనసాగడానికే ఇష్టపడ్డారు సుధాకర్. తమిళ చిత్రాలలో అవకాశాలు సన్నగిల్లే సమయంలోనే సుధాకర్ తెలుగు సినిమాల్లో నటించడానికి అంగీకరించడం మొదలెట్టారు. తమిళనాట హీరోగా సక్సెస్ రూటులో సాగిన సుధాకర్, మాతృభాషలో మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోయారు. దాంతో అందివచ్చిన అవకాశం వినియోగించుకుంటూ ముందుకు సాగారు. ఆపై డైలాగులు వైవిధ్యంగా వల్లిస్తూ, తనదైన మేనరిజమ్ తో కామెడీ రోల్స్ లో భలేగా ఆకట్టుకున్నారు.
సుధాకర్ రాయలసీమకు చెందిన వారు. ఆయన తండ్రి డిప్యూటీ కలెక్టర్. దాంతో పలు చోట్ల సుధాకర్ విద్యాభ్యాసం సాగింది. ఏలూరులో ఫస్ట్ ఇయర్ ఇంటర్, గుంటూరులో సెకండ్ ఇంటర్ చదివాక సుధాకర్ మనసు నటనపైకి మళ్ళింది. ఇంట్లో అందరికంటే చిన్నవాడు కావడంతో ఆయన తండ్రి కూడా గారాము చేసేవారు. దాంతో తనయుడు కోరినట్టుగానే నటనలో శిక్షణ తీసుకోవడానికి సుధాకర్ ను చెన్నై పంపించారు. అక్కడ దక్షిణ చలనచిత్ర వాణిజ్యమండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫిలిమ్ ఇన్ స్టిట్యూట్ లో సుధాకర్ చేరారు. అక్కడే చిరంజీవి, హరిప్రసాద్ ఆయనకు మిత్రులయ్యారు. వీరికి సీనియర్ రాజేంద్రప్రసాద్. వీరందరితోనూ సుధాకర్ ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. ఈ నలుగురిలో అందరికంటే ముందుగా హీరో ఛాన్స్ కొట్టేసింది సుధాకరే.
Also Read
- తెలంగాణ జలియన్‌వాలాబాగ్.. September 17 వేళ గూస్బంప్స్ తెప్పించే వీరుల చరిత్ర!
- Ganesh Utsav: ఇంటికే పరిమితమైన గణపతి గల్లీలోకి ఎలా వచ్చాడో తెలుసా? 1905 నాటి ఆ చరిత్ర ఇదిగో!
- Ayyappa Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం ఇంట్లోనే చేసుకోండిలా!
- Teachers Day Special: ద్రోణాచార్యుడి నుంచి వశిష్ఠుడి వరకు.. దేవతలు సైతం తలవంచిన 10 మంది మహా గురువులు వీరే!
భారతీరాజా తెరకెక్కించిన ‘కిళిక్కు పోగుమ్ రైలు’ చిత్రంలో సుధాకర్ హీరో వేషం వేశారు. అందులో రాధిక నాయిక. 1978లో విడుదలైన ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత సుధాకర్, రాధిక జంటగా పలు చిత్రాలు రూపొంది తమిళనాట విజయవిహారం చేశాయి. అప్పట్లో సుధాకర్ కు యూత్ లో మంచి క్రేజ్ ఉండేది. అడపా దడపా మాతృభాష తెలుగులో సుధాకర్ నటించేవారు. అయితే తమిళనాట సక్సెస్ రూటులో సాగుతున్న సుధాకర్ తెలుగుపై అంత దృష్టి సారించలేదు. అలా ముందుగా రచ్చ గెలిచిన సుధాకర్ తరువాత తెలుగులో విలన్ గా, కేరెక్టర్ యాక్టర్ గా, కమెడియన్ గా అలరించారు.
తన మిత్రులు హరిప్రసాద్, నారాయణరావుతో కలసి చిరంజీవి హీరోగా ‘యముడికి మొగుడు’ చిత్రం నిర్మించారు. ఈ సినిమా 1988వ సంవత్సరం బ్లాక్ బస్టర్ గా నిలచింది. తరువాత రాజేంద్రప్రసాద్ హీరోగా ‘పరుగో పరుగు’ అనే చిత్రాన్ని కూడా సుధాకర్ నిర్మించారు. ఆ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆ పై సుధాకర్ నటనలోనే కొనసాగుతూ, ముఖ్యంగా హాస్యంలో తనకంటూ ఓ మేనరిజమ్ ఏర్పరచుకొని ముందుకు సాగారు. కొంతమంది నిర్మాతలు, దర్శకులు అదేపనిగా సుధాకర్ కు తమ చిత్రాలలో ముఖ్యపాత్రలు ఇచ్చి ప్రోత్సహించారు. ఆ సమయంలో బిజీ కమెడియన్ గా సాగారు. తరువాత అవకాశాలు సన్నగిల్లాయి. అప్పుడు డిప్రెషన్ కు లోనయిన సుధాకర్ కోమాలోకి కూడా వెళ్ళి, కోలుకున్నారు. దాదాపు దశాబ్దం పాటు నటనకు దూరంగా ఉన్నారు. ఆ తరువాత ఒకటి అర చిత్రాలలో నటించినా, మునుపటిలా ఆకట్టుకోలేక పోయారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ప్రశాంత జీవనం సాగిస్తున్నారు సుధాకర్.
(మే 18న ప్రముఖ నటుడు సుధాకర్ పుట్టినరోజు)
తాజావార్తలు
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
-
DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!