కరోనా మహమ్మారి టాలీవుడ్‌లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మేన్‌గా పని చేసిన గంగాధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరో శివాజీకి వ్యక్తిగత మేకప్ మెన్ గా, లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో చీఫ్ మేకప్ మెన్ గానూ పనిచేసిన ఆయన.. నంది అవార్డు కూడా అందుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడతో పాటు బాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు కూడా మేకప్ మెన్‌గా పనిచేశాడు.