నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండలం కొత్తనందికొండలో ఓ యువకుడు చెట్టుపై ఐసోలేషన్ లో ఉండటం.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. అయితే అతడి ఇంట్లో ఉన్నది ఒక్కటే రూము. మరి ఐసోలేషన్ లో అంటే ఎక్కడ ఉండాలనే ప్రశ్న తలెత్తింది. అదే సమయంలో ఇంటి ముందున్న చెట్టు కనిపించింది. అంతే, దాన్ని ఐసోలేషన్ రూమ్ గా మార్చుకున్నాడు. చెట్టుపై మంచం కట్టి అక్కడే ఉంటున్నాడు. చెట్టుపై మంచాన్ని ఏర్పాటు చేసుకొని గత 12 రోజులుగా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఐసోలేషన్ లో ఉన్నాడు. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో శివకు నెగిటివ్ అని తేలినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. శివ ఆలోచనను పలువురు సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు.