కర్ణాటకలోని కోలార్‌లో అక్కాచెల్లెళ్లిద్దరినీ వివాహమాడి వార్తల్లోకెక్కిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. కాగా ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో పోలీసుల […]
ఈ నెల 20న కేరళలో వరుసగా రెండోసారి విజయం సాధించిన పినరయి విజయన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా.. సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‌ఖాన్ విజయన్‌తో ప్రమాణం చేయించనున్నారు. సీఎంతో పాటు మరో 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి 99 […]
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఆక్సిజన్ కొరత ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితుల అత్యధికులకు ఆక్సిజన్ అవసరమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రాణవాయువుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడగా, గ్రీన్ కో సంస్థ చైనా నుంచి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, పెద్ద సంఖ్యలో సిలిండర్లను తెప్పించి తెలంగాణ ప్రభుత్వానికి అందించింది. దీనిపై టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్పందిస్తూ.. గ్రీన్ కో సంస్థకు అభినందనలు తెలిపారు. కరోనా కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వానికి మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా […]
నటి రేణు దేశాయ్ కోవిడ్ బాధితులకు అండగా ఉంటానని.. వారికి తన వంతు సాయంగా బెడ్స్‌ను, ఆక్సిజన్‌ను, మెడిసిన్స్‌ను అందిస్తానని ఇటీవల సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది ఆమెకు ‘హాయ్.. హలో..’ అంటూ మెసేజులు పెడుతున్నారు. కాగా రేణు మరోసారి సోషల్ మీడియా లైవ్ లోకి వచ్చి విజ్ఞప్తి చేసింది. ‘మీ అనవసర మెసేజ్స్ వల్ల అవసరమైన కోవిడ్ బాధితులకు సాయం అందకుండా పోతుంది. దయచేసి మీరు అలాంటి మెసేజ్స్ […]
కరోనా మహమ్మారి మహిళలకు కొత్త కష్టాలు తెచ్చిపెడుతోంది. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితం కావడంతో వేధింపులకు గురవుతున్నారు. రోజులో ఏదోవొక సందర్భంలో భర్తల చేతిలో భౌతిక దాడులకు గురవుతున్నారు. తెలంగాణలో రెండున్నరేళ్లలో పెరిగిన గృహ హింస ఫిర్యాదులే దీనికి నిదర్శనం. మహిళా సహాయ కేంద్రం ఏర్పాటు చేసిన రెండేన్నరేళ్లలో వచ్చిన ఫిర్యాదులు కన్నా కరోనా కాలంలోనే ఎక్కువగా నమోదు కావడం గమనార్హం. రోజుకు సగటున సుమారు 28 చొప్పున ఏడాది కాలంలో 10,338 కేసులు నమోదయ్యాయి. అలాగే లైంగిక […]
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్ […]
గత ఏడాది పొలిటికల్ థ్రిల్లర్ ‘చదరంగం’, హ్యూమరస్ ‘అమృతం ద్వితీయం’, స్పోర్ట్స్ డ్రామా ‘లూజర్’, క్రైమ్ & యాక్షన్ ‘షూట్ అవుట్ ఎట్ ఆలేరు’ వంటి ఒరిజినల్ వెబ్ సిరీస్‌లను అందించి, ప్రజల ఆదరణ, అభిమానం సొంతం చేసుకొన్న ‘జీ 5’ ఈ ఏడాది మరో ఒరిజినల్ వెబ్ సిరీస్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రముఖ దర్శకుడు తరుణ్ భాస్కర్ సమర్పణలో ఇంజనీరింగ్ కాలేజీ నేపథ్యంలో రూపొందిన వెబ్ సిరీస్ ‘రూమ్ నంబర్ 54 ‘జీ […]
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దుబాయ్‌లో మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా బ్రేక్ పడింది. ఇదిలావుంటే, ఈనెల 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా సర్కారు వారి పాట సినిమాలోని మహేష్ లుక్ తో చిన్నపాటి టీజర్ నే చిత్ర యూనిట్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీంతో […]
దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న వేళ పలు రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు, కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది మంచి ముహూర్తాలు వున్నా.. పెళ్లిళ్లలను చాలా మంది తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లోనూ మంచి ముహుర్తాలే ఉండటంతో ఎలాంటి హడావుడి లేకుండా వివాహాలు జరుగుతున్నాయి. ఎక్కువ మంది అతిథులు లేకున్నా.. మండపాలు లేకున్నా చాలా చోట్ల ఇండ్లల్లో, గుళ్ళల్లో పెళ్లిళ్లు జరుగుతున్నాయి. పరిమిత సంఖ్యలో నిబంధనలు ఉండటంతో తక్కువ మంది […]