Janhvi Kapoor : ఆ విషయంలో జాన్వీకి సపోర్ట్ చేస్తూ.. ప్రియాంక పోస్ట్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్‌లో టాలెంట్, గ్లామర్‌తో పాటు తన స్పష్టమైన అభిప్రాయాలతో కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న జాన్వీ కపూర్, ఇటీవల మరోసారి ధైర్యంగా మాట్లాడిన మాటలతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ముంబైలో జరిగిన మహిళా శక్తి, సమానత్వంపై ప్రత్యేక కార్యక్రమంలో మాట్లాడిన జాన్వీ, సినీపరిశ్రమలో మహిళలు ఎదుర్కొనే ఒత్తిళ్లు, ముఖ్యంగా పురుష అహంకారం ఇంకా ఎంత బలంగా ఉందో వివరించింది.
Also Read : Prabhas : డార్లింగ్‌కు జక్కన్న పంపిన స్పెషల్ లేఖ..వైరల్
Also Read
- Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
- The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
- India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
జాన్వీ మాట్లాడుతూ.. “నేను ఒక మహిళగా పుట్టినందుకు అత్యంత గర్వంగా ఉంది. మహిళలు బలహీనులు కాదు.. వారు శక్తి మరియు సాహసం కలిగినవారు. సమానత్వం గురించి మాట్లాడితేనే మార్పు మొదలవుతుంది. నలుగురు మహిళల మధ్య నా అభిప్రాయం నేరుగా చెప్పగలను. కానీ నలుగురు పురుషులు ఉన్నచోట చాలా జాగ్రత్తగా, వాళ్లు నొచ్చుకోకుండా మాట్లాడాలి. ఈ ఇండస్ట్రీలో మహిళగా ఉన్న నేను ఈ విషయంలో ఎన్ని సార్లు నలిగిపోయానో నాకు తెలుసు” అని తెలిపింది. ఈ మాటలు అనేక మహిళలకు కూడా తన అనుభవాన్ని గుర్తు చేశాయి.
జాన్వీ మాటలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుండగా, ఈ విషయంపై గ్లోబల్ ఐకాన్ ప్రియాంక చోప్రా స్పందించడం మొత్తం చర్చను మరో లెవెల్‌కి తీసుకెళ్లింది. ప్రియాంక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో జాన్వీ వీడియోను రీ-షేర్ చేస్తూ.. “ఇలా మాట్లాడే అమ్మాయిలకు మనం మద్దతు ఇవ్వాలి. ఇలాంటి మాటలు మార్పులు తొలిమెట్టు” అని రాసింది. ప్రియాంక ఈ స్పీచ్‌కు సపోర్ట్ ఇవ్వడం, జాన్వీకి కాదు, మొత్తం మహిళల కోసం ఒక పాజిటివ్ సిగ్నల్‌గా మారింది.
ఇప్పటికే సోషల్ మీడియాలో #JanhviKapoor #PriyankaChopra హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. జాన్వీ ధైర్యాన్ని ప్రశంసిస్తూ అనేక సెలబ్రిటీలు, అభిమానులు తమ అభిప్రాయాలు రాస్తున్నారు. “ఈ వాయిస్‌లు పెరిగినప్పుడే ఇండస్ట్రీ మారుతుంది”, “ఇద్దరు స్టార్‌ల ధైర్యం నిజంగా ఇన్స్పిరేషన్” వంటి కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. జాన్వీ మాటలు కేవలం ఒక ప్రసంగంగా కాకుండా, ఇండస్ట్రీలో మహిళల కోసం ఒక కొత్త చర్చకు దారితీశాయి.
తాజావార్తలు
-
Debt Trap: అప్పు మీద అప్పు! దాచుకునేది తక్కువ..లోన్లు ఎక్కువ…ఇదే భారతీయుల దుస్థితి!
-
Shah Rukh Khan: సౌత్ దర్శకులే కావాలంటున్న షారుఖ్.. నెక్స్ట్ సినిమాలపై భారీ స్కెచ్!
-
Saudi Arabia Oil: హోర్ముజ్ తర్వాత మరో షాక్.. మూతపడ్డ సౌదీ చమురు పైప్‌లైన్.. భారత్‌కు పెరిగిన కష్టాలు!
-
The Paradise: ప్యారడైజ్ సినిమా కోసం ఎన్ని టన్నుల రక్తం వాడారో తెలుసా.?
-
India Matches: రేపు భారత్‌కు డబుల్ ధమాకా.. అఫ్గాన్‌తో పురుషుల జట్టు.. శ్రీలంకతో మహిళల టైటిల్ పోరు.!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!