విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగ చైతన్య హీరోగా రాబోతున్న ‘థాంక్యూ’ సినిమాలో హీరోయిన్ గా రాశి ఖన్నా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే ఇటలీలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. కోవిడ్ నేపథ్యంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ చిత్రీకరణ జరిపారు. అయితే తాజాగా ఇటలీ షూటింగ్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓ పార్కులో కూర్చున్న చైతన్యను రాశిఖన్నా వెనకనుంచి గట్టిగా కౌగిలించుకుంది. ప్రస్తుతం ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటుంది. కాగా ‘థాంక్యూ’ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు-శిరీష్-హర్షిత్ రెడ్డిలు కలిసి నిర్మిస్తున్నారు. మరోవైపు రాశి ఖన్నా ‘పక్కా కమర్షియల్’ సినిమాలోను నటిస్తుండగా, చైతు ‘లవ్ స్టోరీ’ సినిమాను పూర్తిచేసుకొని వున్నాడు.