ప్రముఖ దర్శకుడు శంకర్ తల్లి ముత్తు లక్ష్మి (88) మరణించారు. వయోభార సమస్యలతో ఆమె మంగళవారం తుదిశ్వాస విడిచారు. ఆమె మృతికి కోలీవుడ్‌తోపాటు ఇతర చిత్ర పరిశ్రమ ప్రముఖులూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులు కూడా సంతాపం తెలుపుతున్నారు. ప్రస్తుతం శంకర్ త్వరలో రామ్ చరణ్ హీరోగా ఓ సినిమా, రణవీర్ సింగ్ హీరోగా మరో సినిమా చేయనున్నారు. కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 తెరకెక్కిస్తున్నారు.