క్యూట్ గర్ల్ కృతి శెట్టి నటించిన తొలి చిత్రం ‘ఉప్పెన’ తో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటోంది. నానితో కలిసి ‘శ్యామ్ సింగరాయ్’.. సుధీర్‌బాబుతో కలిసి ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’.. రామ్, లింగుస్వామి కాంబోలో వస్తున్న ఓ సినిమాలోనూ నటించనుంది. ఇదిలావుంటే, కృతి మరిన్ని కొత్త ప్రాజెక్టులను కూడా ఒకే చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్ కుమారుడు గణేశ్ త్వరలోనే సినిమాల్లో అరంగేట్రం చేయనున్న సినిమాలోనూ కృతి ఎంపిక అయినట్లు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ రూమర్లకు చెక్ పెట్టేలా కృతిశెట్టి సోషల్మీడియాలో స్పందించింది. ‘నేను నటించబోతున్న కొత్త సినిమాలపై చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం నేను మూడు సినిమాల్లో నటిస్తున్నాను. నాని, సుధీర్ బాబు, రామ్ తో నటిస్తున్నాను. ఈ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడమే ఇప్పుడు నా ముందున్న లక్ష్యం. ఏవైనా సినిమాలకు సంతకం చేసినప్పుడు తప్పకుండా తెలియజేస్తాను’ అంటూ కృతి క్లారిటీ ఇచ్చింది.
I am hearing a lot of rumours about my next projects. As of now I have signed 3 films in total (one with Nani garu, Sudheer Babu garu and Ram garu). Now my only concentration is to finish my commited projects. When I do sign my next projects, I will keep you posted for sure.
— KrithiShetty (@IamKrithiShetty) May 18, 2021