దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారాన్ని కోరుతూ బుధవారం నుంచి తెలంగాణ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగిన సంగతి తెలిసిందే. అత్యవసర సేవలు మినహా మిగతా విధులు బహిష్కరి స్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ప్రకటించింది. కాగా, తాజాగా జూనియర్ డాక్టర్ల సమ్మెపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూనియర్ డాక్టర్ల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని, సమ్మె చేసేందుకు ఇది సమయం కాదన్నారు. సమ్మె విరమించాలని అందరినీ కోరుతున్నా.. లేదంటే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.