దేశంలో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు కరోనాతో పోరాడుతున్నారు. ఇలాంటి ఆపద సమయంలో చాలా మంది తమకు తోచిన సాయం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణకు సాయంగా నిలిచేందుకు కోరమాండల్ ఫర్టిలైజర్స్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.1 కోటి విరాళం ప్రకటించింది. కోరమాండల్ ఫర్టిలైజర్స్ ఎండీ సమీర్ గోయల్, వైస్ ప్రెసిడెంట్ కె.సత్యనారాయణ ఇవాళ హైదరాబాద్ ప్రగతి భనవ్ లో సీఎం కేసీఆర్ ను కలిసి విరాళం చెక్ ను అందజేశారు.