యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రం ‘సలార్’. శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నాడని తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో ప్రభాస్ ను ఢీకొట్టబోయే నటుడు కోసం అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా బాలీవుడ్ యాక్షన్ హీరో జాన్ అబ్రహం నటించే అవకాశం కనిపిస్తోంది. చిత్రంలోని ఓ కీలకమైన నెగిటివ్ పాత్ర కోసం ఆయనను సంప్రదిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే గనుక నిజమైతే జాన్ అబ్రహం ఈ సినిమాకు అదనపు ఆకర్షణ అని చెప్పొచ్చు.