ఆహాలో ప్రసారమై, చక్కని ఆదరణ పొందిన సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ లాక్డ్. దీనిని సంబంధించిన రెండో సీజన్ అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతోంది. వైద్యశాస్త్రంలో కఠినతరమైన ఎన్నో కేసులకు పరిష్కారాలను సూచించిన గొప్ప న్యూరో సర్జన్ డాక్టర్ ఆనంద్ పాత్రలో సత్యదేవ్ నటించారు. అయితే తన పేరు ప్రతిష్టలను నాశనం చేయగల ఓ రహస్యాన్ని ఈ ప్రపంచానికి తెలియకుండా దాచేస్తాడు. లాక్డ్ సీజన్ 1ను డైరెక్ట్ చేసిన ప్రదీప్ దేవ కుమార్ సీజన్ 2ను కూడా […]
జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న […]
ప్రముఖ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్‌గా జానీ మాస్టర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందాన పేరు పరిశీలనలో వుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై నిర్మాత దిల్ రాజు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్‌లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని […]
రుతుపవనాలు, అల్పపీడన ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో 10 రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా మరో రెండు రోజుల పాట వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఎడతెరిపి లేకుండా వర్షానికి పలు చోట్ల రహదారులు దెబ్బతినగా, పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.ఇక […]
యంగ్ టైగర్ ఎన్టీయార్ మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిపోయారు. ఓ పక్క ‘ట్రిపుల్ ఆర్’ మూవీ షూటింగ్ ను పూర్తి చేస్తూనే, మరో పక్క జెమినీ టీవీలో ప్రసారం కాబోతున్న ‘ఎవరు మీలో కోటీశ్వర్లు’ షో షూట్ తో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే ‘ట్రిపుల్ ఆర్’ తర్వాత వెంటనే ఎన్టీయార్ తో మూవీ ప్రారంభించడానికి కొరటాల శివ సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే ఒకసారి బుల్లితెరలో బిగ్ బాస్ షో కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన […]
తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఇతర ఉన్నత అధికారులు హాజరైయ్యారు. దావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున ప్రజాప్రతినిధులు, అధికార […]
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ […]
మోహన్ లాల్, మీనా లది మలయాళంలో సూపర్ హిట్ జోడి. ఈ మధ్య కాలంలో అయితే ‘దృశ్యం, దృశ్యం-2’లో వాళ్ళు జంటగా నటించారు. దానికి ముందు కూడా వాళ్ళిద్దరూ కలిసి దాదాపు ఆరేడు సినిమాల్లో నటించారు. ఇప్పుడు మరోసారి మోహన్ లాల్ మూవీ ‘బ్రో డాడీ’లో మీనా నటిస్తోంది. బహుశా ఇది వాళ్ళిదరికీ పదో చిత్రం కావచ్చు. అయితే మీనా… మోహన్ లాల్ కు జోడీగా నటిస్తోందా లేదా అనేది మాత్రం తెలియ రాలేదు. బుధవారం ‘బ్రో […]
బాలీవుడ్ లో ప్రస్తుతం చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోన్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’. ‘యురి’ సినిమా దర్శకుడు ఆదిత్య దర్ సారథ్యం వహించనున్నాడు. విక్కీ కౌశల్ హీరోగా సినిమా తెరకెక్కనుంది. అయితే, మహాభారత కాలం నాటి అశ్వథ్థామకు సంబంధించిన కథతో ముడిపడ్డ ఈ ఫ్యాంటసీ మూవీ ఇప్పటికే డిలే అయింది. కరోనా లాక్ డౌన్ కారణంగా 2021 మొదట్లో ప్రారంభం కావాల్సిన షూటింగ్ ఇంత వరకూ ముందుకు సాగలేదు. అయితే, ఇప్పుడు మరోసారి ‘ఇమ్మోర్టల్ […]