తెలంగాణలో వర్షాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణశాఖ హెచ్చరికలపై ఉన్నతస్థాయి రివ్యూ నిర్వహించారు. ఈ మీటింగ్ లో ఇరిగేషన్, పంచాయితీరాజ్, మున్సిపల్, విద్యుత్ శాఖ, ఇతర ఉన్నత అధికారులు హాజరైయ్యారు. దావరి, కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. యుద్ధప్రాతిపదికన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లాల్లో ప్రమాదకర స్థాయిలో వర్షాలు కురుస్తున్నందున ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.