జులై 24న తెలంగాణ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు.. ఈ సందర్భంగా బొకేలు, కేకులు, హోర్డింగులు అంటూ డబ్బుని వృధా చేయవద్దని ఆయన సూచించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ‘గిప్ట్ ఏ స్మైల్’ లో భాగంగా వంద మంది దివ్యాంగులకు ప్రత్యేకమైన ద్విచక్ర వాహనాలను అందించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గత ఏడాది తాను 6 అంబులెన్స్ లను విరాళంగా ఇవ్వగా.. తెరాస ప్రజా ప్రతినిధులు, నేతలు 90 వాహనాలు ఇచ్చారని గుర్తు చేశారు. అవసరం ఉన్న వారికి వ్యక్తిగతంగా సాయం అందించాలని, వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటాలని తెరాస నేతలు, అనుచరులకు కేటీఆర్ పిలుపునిచ్చారు.
Read Also: ఎన్టీయార్ రియాలిటీ షో టెలికాస్ట్ ఎప్పుడంటే…
మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసిన కాసేపటికే.. టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తల నుంచి భారీ స్పందన వస్తోంది. తమ వంతుగా వాహనాలను విరాళం ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ కూడా 50 మంది దివ్యాంగులకు స్కూటీలు ఇస్తాన్నట్లు ప్రకటించారు. దయగల మంత్రి కేటీఆర్ సారధ్యంలో పనిచేయడం తమ అదృష్టమన్నారు.. ఆయన అడుగు జాడల్లో నడవటం స్ఫూర్తిదాయకం అంటూ బాల్క సుమన్ ట్వీట్ లో పేర్కొన్నారు. మరింత మంది నేతలు కూడా సాయం చేయడానికి ముందుకు వస్తున్నారు.