ప్రతిభావంతులను ఆదరించడంలో తెలుగువారు ముందుంటారు. తమిళ స్టార్ హీరో సూర్యను మనవాళ్ళు భలేగా ఆదరిస్తున్నారు. సూర్య నటించిన అనేక తమిళ చిత్రాలు తెలుగులో అనువాదమవుతూ, ఇక్కడా విజయం సాధిస్తూనే ఉన్నాయి. ప్రముఖ తమిళనటుడు శివకుమార్ పెద్ద కొడుకు సూర్య. తండ్రి బాటలోనే పయనిస్తూ సూర్య నటనలో అడుగు పెట్టారు. ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన ‘నెర్రుక్కు నెర్’ సినిమాతో పరిచయమైన సూర్య, ‘నందా’తో నటునిగా గుర్తింపు సంపాదించారు. ‘కాక్క కాక్క’తో మంచి విజయం చూశారు. ఈ సినిమా […]
బహుజనుల బతుకులు మారాలంటే వంద శాతం ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి అవసరం ఉందని మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. బహుజనులు కేంద్రంగా కొత్త పార్టీ రావాలన్నారు. తెలంగాణలో బహుజనులకు న్యాయం జరగలేదు, సంపద అంతా ఒక్క శాతం మంది దగ్గర ఉందని, 99 శాతం మందికి తాయీలాలతో నడిపిస్తున్నారన్నారు. ‘దళిత బంధు’ చర్చలకు నాకు ఆహ్వానం లేదు అని తెలిపారు. రాజకీయాల్లోకి రావడం ఖాయం అని తేల్చేశారు. ఎప్పుడనేది త్వరలోనే ప్రకటిస్తానన్నారు. ఆరేళ్ళ […]
ప్రధాని నరేంద్ర మోడీతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ భేటీ కానున్నారు. ఈ నెల 28న వీరి భేటీ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో కూడా భేటీ కానున్నారు. మమతా బెనర్జీ కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. కేంద్రంలో ‘పెగాసస్’ స్పైవేర్ వివాదం నడుస్తున్న సమయంలో మమత భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. దాదాపు మూడు నెలల తర్వాత మమతా ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అయితే ఇది […]
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కరోనా బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 1,14,928 కరోనా పరీక్షలు నిర్వహించగా, 648 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 82 కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ జిల్లాలో 59, వరంగల్ అర్బన్ జిల్లాలో 52 కేసులు వెల్లడయ్యాయి. నిర్మల్ జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. అదే సమయంలో 696 మంది కరోనా నుంచి కోలుకోగా, ముగ్గురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా […]
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహిస్తున్నారు. నేడు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాల గ్రామంలో ఆయన పర్యటించారు. మాట్లాడుతూ.. ‘నాలుగు రోజులుగా వర్షంలో తడుస్తున్నావు, ఎండుతున్నావు ఎందుకు బిడ్డ అని ప్రజలు అడుగుతున్నారని ఈటల చెప్పుకొచ్చారు. కేసీఆర్ డబ్బు, అధికారం, పోలీసుల ముందు నేను గెలువలేను. అందుకే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని మీ ముందుకు వచ్చాను అంటూ తెలిపారు. ఇక్కడికి వచ్చి నేను అంటే నేను […]
ఘట్‌కేసర్ జోడిమెట్లలో దారుణం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ఫీజులు చెల్లించలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకోంది. విద్యార్థిని లావణ్య తాను చనిపోయేముందు సెల్ఫీ వీడియోను తల్లిదండ్రులకు పంపింది. ఫీజుల కోసం కాలేజ్ యాజమాన్యం వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ బలవన్మరణానికి పాల్పడింది.. యాజమాన్యం తీరుపై కాలేజీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, ఇటీవల ఇంజనీరింగ్ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేస్తున్నాయి. చదువులకు అధిక ఫీజులు చెల్లించడం.. కుటుంబాలకు భారం అవుతున్నామనే భావనలో […]
‘ఆకాశం నీహద్దురా’ సినిమాతో నటుడిగా మరోసారి తన సత్తా చాటిన సూర్య ఇప్పుడు ‘నవరస’ ఆంధాలజీతో పాటు రెండు ఫీచర్ ఫిల్మ్స్ లో నటిస్తున్నాడు. అందులో ఒకటి వెట్రిమారన్ దర్శకత్వంలో చేస్తున్న ‘వాడి వాసల్’ కాగా, రెండోది పాండిరాజ్ దర్శకత్వంలో చేస్తున్నాడు. శుక్రవారం సూర్య పుట్టిన రోజు సందర్భంగా అతని 40వ చిత్రం టైటిల్ ను చిత్ర బృందం ప్రకటించింది. పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్న చిత్రానికి ‘ఎదర్కుం తనిందవన్’ అనే పేరు పెట్టారు. విశేషం ఏమంటే… […]
నటి ప్రియమణి 2017లో ముస్తఫారాజ్ అనే వ్యాపారవేత్తను పెళ్లాడడం తెలిసిందే. అయితే, కొద్దిరోజులుగా ముస్తఫారాజ్ మొదటి భార్య ఆయేషా వారి పెళ్లిపై ఆరోపణలు చేస్తోంది. తాము ఇంకా విడాకులు తీసుకోలేదని, ప్రియమణితో తన భర్త రెండో పెళ్లి చెల్లదని చెబుతోంది. ముస్తఫా, తాను ఇప్పటికీ భార్యాభర్తలమేనని, ప్రియమణితో అతడి పెళ్లి నాటికి తాము విడాకులకు కూడా దరఖాస్తు చేయలేదని స్పష్టం చేసింది. కాగా, ముస్తఫారాజ్, ఆయేషా దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే విభేదాల నేపథ్యంలో 2010 […]
మరో అవినీతి తహసీల్దార్ ఏసీబీ వేసిన వలకి చిక్కింది. పక్కా ప్లాన్ తో ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ ని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టబడింది. కొత్తపల్లికి చెందిన ఐత హరికృష్ణ అనే వ్యక్తి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3లో తన భూమికి పట్టా పాస్ బుక్కులు ఇచ్చేందుకు తహసీల్దార్ రూ. 3 లక్షలు డిమాండ్ చేసింది. దీంతో హరికృష్ణ ఏసీబీ అధికారులను […]
నిర్మల్ జిల్లా నీటిమయమైంది. జిల్లా అంతటా ఎటు చూసినా వరదలే కనిపిస్తున్నాయి. ప్రధాన వీధులు శివారు ప్రాంతాలు జలమయమైయ్యాయి. వాగులు, వంకలు ఉప్పొంగి వరద ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమములోనే రహదారులపైకి భారీగా చేపలు వచ్చాయి. దీంతో పలువురు స్థానికులు రోడ్లపై చేపలు పట్టారు. ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక నిర్మల్ వరద పరిస్థితిపై మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో సీఎం కేసీఆర్ ఆరా తీశారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి […]