ప్రముఖ దర్శకుడు శంకర్ మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. ఇటీవలే ఈ సినిమాకు మాటల రచయితగా సాయి మాధవ్ బుర్రా, సంగీత దర్శకుడిగా తమన్, కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. రష్మిక మందాన పేరు పరిశీలనలో వుంది. కాగా, తాజాగా ఈ చిత్ర షూటింగ్ పై నిర్మాత దిల్ రాజు స్పష్టతనిచ్చారు. సెప్టెంబర్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తామని తెలిపారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించబోతున్నాడని సమాచారం.