పాకిస్తాన్‌కు చెందిన ఆరేళ్ల బాలిక సోనియా ఖాన్.. తన అద్భుతమైన క్రికెట్ ప్రదర్శన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్లాస్టిక్ బంతితో ఆమె ప్రాక్టీస్ షాట్లు చూస్తే.. క్రికెట్ అభిమానులు బాలికపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కాగా.. ఇంగ్లీష్ క్రికెట్ అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో ఈ వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేయగా.. ఈ వీడియో ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులలో క్షణాల్లో వైరల్‌గా మారింది.
Read Also: YS Jagan: డీలిమిటేషన్పై ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ..
ఈ వైరల్ వీడియోలో.. బాలిక సోనియా తన ఇంటి వరండాలో ప్లాస్టిక్ బంతితో క్రికెట్ ప్రాక్టీస్ చేస్తునట్లు కనిపిస్తోంది. బాలిక సమయానుగుణంగా పుల్ షాట్లను కొడుతూ.. తన టెక్నిక్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వీడియోలో సోనియా పుల్ షాట్‌ను ఎలా అద్భుతంగా ఆడాలో చూపిస్తుంది. ఆమె నిర్భయంగా బంతిని ఎదుర్కొన్న తీరు.. టెంపో, టైమింగ్ ఒక టాప్ క్లాస్స్ బ్యాట్స్‌మెన్‌లా అనిపిస్తుంది. ఈ క్రమంలో.. ఆ బాలికను రోహిత్ శర్మతో పోల్చుతున్నారు.
Read Also: Ruhani : ఏవమ్మా రుహాణి శర్మ.. అందాలు ఇలా చూపిస్తే ఎలాగమ్మా..
రిచర్డ్ కెటిల్‌బరో ఈ వీడియోను షేర్ చేస్తూ.. “ఆరేళ్ల సోనియా ఖాన్ పాకిస్తాన్‌కు చెందిన ఒక ప్రతిభావంతురాలు, ఆమె రోహిత్ శర్మలా పుల్ షాట్ ఆడుతుంది” అని పేర్కొన్నారు. ఈ వీడియోను ‘X’ లో అప్‌లోడ్ చేయగా.. దాదాపు 1 మిలియన్ మంది వీక్షించారు. ఈ వీడియోపై వ్యక్తిగతంగా కామెంట్లు కూడా వస్తున్నాయి. ఒక యూజర్, “ఈ అమ్మాయి చాలా బాగా ఆడుతోంది. ఆమె అద్భుతమైన శైలిలో షాట్లు కొడుతోంది,” అని పేర్కొన్నారు. ఈ వీడియోపై కొంతమంది యూజర్లు.. “ఈ అమ్మాయిని న్యూజిలాండ్‌లో జరిగే పాకిస్తాన్ జట్టులో భాగంగా పంపాలి” అని ఫన్నీగా కామెంట్ చేస్తున్నారు. ఇంకొంతమంది “ఈ చిన్నారి పాకిస్తాన్ జట్టులో చేరాలని,” అని కామెంట్ చేశారు. మరో వినియోగదారు.. బాబర్ ఆజమ్ రిటైర్మెంట్ అయిపోవాలని వ్యాఖ్యానించారు.
6 yrs old ~ Talented Sonia Khan from Pakistan 🇵🇰 (Plays Pull Shot like Rohit Sharma) 👏🏻 pic.twitter.com/Eu7WSOZh19
— Richard Kettleborough (@RichKettle07) March 19, 2025