మారుతి సుజుకి భారత్ మార్కెట్లో కాంపాక్ట్ SUV విభాగంలో అనేక ప్రఖ్యాత మోడళ్లను అందిస్తుంది. ఈ విభాగంలో ఒక ప్రముఖ మోడల్‌గా మారుతి బ్రెజ్జా నిలుస్తుంది. ఈ కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నవారు.. బేస్ వేరియంట్ Lxi (పెట్రోల్) లోన్ పై కొనుగోలు చేయడం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.. మారుతి బ్రెజ్జా బేస్ వేరియంట్ Lxi ధర ఎక్స్-షోరూమ్ ధర రూ. 8,69,000 (8.69 లక్షలు). ఆన్-రోడ్ ధర (RTO చార్జీ రూ. 61,660, భీమా రూ. 27,682 మరియు ఇతర ఛార్జీలతో) మొత్తం రూ. 9,65,454 (9.65 లక్షలు) ఉంటుంది.
Read Also: Abhishek Bachchan : ఐశ్వర్య ఫోన్ కాల్స్ నన్ను ఒత్తిడికి గురి చేస్తాయి..!
డౌన్ పేమెంట్ ఎంత చెల్లించాలంటే..?
మీరు మారుతి బ్రెజ్జా కారును కొనుగోలు చేయాలనుకుంటే.. రూ. 2 లక్షల డౌన్ పేమెంట్ చెల్లించాలి. ఈ డౌన్ పేమెంట్ తర్వాత, మీరు బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 7,65,454 (7.65 లక్షలు) రుణం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంత EMI చెల్లించాలి..?
మీరు 9% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలం కోసం రుణం తీసుకుంటే.. ప్రతి నెలా EMIగా రూ. 12,315 చెల్లించాల్సి ఉంటుంది.
కారు ధర మొత్తం ఎంత..?
9% వడ్డీ రేటుతో 7 సంవత్సరాల కాలం పాటు తీసుకున్న రుణంపై మీరు రూ. 2,69,044 (2.69 లక్షలు) వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. డౌన్ పేమెంట్ (రూ. 2 లక్షలు) వడ్డీని కలిపితే.. మీరు మారుతి బ్రెజ్జా Lxi (పెట్రోల్) ను మొత్తం రూ. 12,34,498 (12.34 లక్షలు)కు సొంతం చేసుకోవచ్చు.
మారుతి బ్రెజ్జా Lxi ఫీచర్లు:
ధర: రూ.8.69 లక్షలు నుంచి రూ.14.14 లక్షలు
ఇంజిన్: 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్
మైలేజ్: 18 kmpl నుంచి 20 kmpl వరకు
ఫీచర్లు: 9 అంగుళాల టచ్‌స్క్రీన్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, వైర్‌లెస్ ఛార్జింగ్, హెడ్-అప్ డిస్ప్లే, 4 స్పీకర్లు, యాంబియెంట్ లైటింగ్, సన్‌రూఫ్ కలిగి ఉంటుంది.
సేఫ్టీ ఫీచర్లు: 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో ABS, ISOFIX, వెనుక పార్కింగ్ సెన్సార్, ESP, హిల్-హోల్డ్, 360 డిగ్రీ కెమెరాను కలిగి ఉంటుంది.