తిరుమలలో పెను ప్రమాదం తప్పింది. రెండో ఘాట్ రోడ్డులో భక్తులతో వెళ్తున్న బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. హరిణి దాటిన తరువాత డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో.. బస్సు రోడ్డుకు అడ్డంగా ఉండిపోయింది.
జగిత్యాల జిల్లాలో ఓ వ్యక్తి.. బస్టాండ్, రద్దీ ప్రాంతాలు, మార్కెట్లలో రోడ్ల పై ఉన్న మహిళల ఫోటోలు అసభ్యకరంగా తీస్తూ ఇన్స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తున్నాడు. మహిళలు, యువతుల ఫోటోలు తీసి ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేస్తున్నాడు శ్రవణ్ అనే వ్యక్తి. తైస్ అండ్ లెగ్గిన్స్ పేరిట ఇన్‌స్టాలో పోస్టులు పెడుతున్నాడు.
మూడు రోజులుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో నిర్వహిస్తున్న సంక్రాంతి పడవల పోటీలు ఘనంగా ముగిశాయి. ఒక కిలోమీటరు డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్‌లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా , జంగారెడ్డిగూడెం జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవ పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి.
సీఎం చంద్రబాబు నేతృత్వంలో 9 మంది బృందం దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెల 20 నుంచి 24 వరకు నాలుగు రోజుల పాటు దావోస్‌లో పర్యటించనున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్ధిక సదస్సు (వరల్డ్ ఎకానామిక్ ఫోరం)లో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.
గుంటూరు జిల్లా తెనాలి మండలం పెదరావూరులో సంక్రాంతి సంబరాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. వ్యవసాయ క్షేత్రంలో భోగిమంటలను వెలిగించారు. అనంతరం.. భోగి వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలు, నాయకులు, కార్యకర్తలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం, పారిశ్రామిక వాడలు సహా అనేక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపిందన్నారు.
చిత్తూరు జిల్లాలో పండగ వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పిల్లలతో సహా తల్లి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. తల్లి కరిష్మా (27) పరిస్థితి విషమంగా ఉంది.
తిరుచానూరులో కొత్తగా ఏర్పాటు చేసిన ఇంటింటికి పైప్ లైన్ ద్వారా గ్యాస్ పంపిణీని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. శరవణ అనే ఇంటి యాజమాని ఇంటిలో ప్రారంభించారు. అంతేకాకుండా.. సీఎం చంద్రబాబు స్వయంగా టీ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశం మొత్తం ఎనర్జీ, పెట్రోలియం రంగంలో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయన్నారు. గతంలో గ్యాస్ ఉచితంగా అందించిన ఘనత టీడీపీదేనన్నారు.
క్రికెట్ అభిమానులకు శుభవార్త.. ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న ఓ గుడ్ న్యూస్‌ను బీసీసీఐ చెప్పింది. ఐపీఎల్ (IPL) 2025 సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్ ను తాజాగా ప్రకటించింది. మార్చి 21వ తేదీ నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అలాగే.. మే 25న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగనున్నట్లు పేర్కొన్నారు. మార్చి 23 నుంచి మే 25 వరకు ఐపీఎల్-2025 జరుగుందని తెలిపారు. మొదటి మ్యాచ్‌లో చెన్నై వేదికగా చెన్నై వర్సెస్ ఆర్సీబీ తలపడనున్నాయి.
విశాఖలో సంక్రాంతి సందడి మొదలైంది. సాంప్రదాయ దుస్తుల్లో యువతీ యువకులు ఎంజాయ్ చేస్తున్నారు. డు..డు.. బసవన్నలు, గంగిరెద్దుల హడావిడి మొదలైంది. తెలుగుతనం ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. మరోవైపు.. రాజ్యసభ మాజీ ఎంపీ, సీనియర్ బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో పెద్ద పండుగ సంబరాలు అట్టహాసంగా మొదలయ్యాయి.