కృష్ణా జిల్లా కంకిపాడులో సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించారు. పోటీలలో పలువురు తమ ప్రతిభను చూపించారు. ఒకే ముగ్గులో మొత్తం సంక్రాంతి అంతా చూపించడం అబ్బురపరిచింది. సంక్రాంతి అంటే ముగ్గు నుంచి మనం మరిచిపోతున్న హరిదాసు వరకూ.. పాలు పొంగడం నుంచి రైతు ఇంటికి పంట తేవడం వరకూ అన్నీ కనిపించేలా ముగ్గు వేశారు. రైతే రాజు అనే నినాదం రాష్ట్రం అంతా వినిపిస్తున్న నేపథ్యంలో ఆ నినాదాన్ని వినిపిస్తూ కూడా ముగ్గులేసారు.
Read Also: Daaku Maharaaj: ప్రీ రిలీజ్ చేయలేకపోయాము.. అక్కడే సక్సెస్ మీట్!
మరోవైపు.. కంకిపాడులో ఎడ్ల పందేలను వైభవంగా నిర్వహిస్తున్నారు. జనసేన జెండాలతో ఎడ్ల బండ్లను సిద్ధం చేసారు. ఒకొక్క బండికి ఆరు నిముషాల సమయం ఇస్తూ ఎడ్ల పందాలు నిర్వహించారు.. ఈ పందేలను చూడటానికి రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చారు.. మహిళలు సైతం ఈ పోటీలలో పాల్గొనడం విశేషం… అయితే రైతుకు ఎంతో ఉపయోగపడే ఎడ్లను సంతోషపరచడానికి, వాటిపైన ప్రేమతోనే ఈ పందేలు నిర్వహిస్తున్నామని.. ఈ పందేలు రైతు కోసమే అని నిర్వాహకులు చెబుతున్నారు.
Read Also: AP Govt: భవన నిర్మాణాలు, లేఔట్లకు అనుమతులు మున్సిపాలిటీలకు అప్పగింత..
ఎడ్ల బండి లాగుడు పోటీ వీక్షించడానికి మచిలీపట్నం జనసేన ఎంపీ బాలశౌరి వచ్చారు. ఎడ్ల బండి లాగుడు పోటీలో ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందజేశారు. ముగ్గుల పోటీలో గెలిచిన వారికి కూడా బహుమతులు అందజేశారు ఎంపీ బాలశౌరి. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు పరిధిలో రోడ్లు గత ప్రభుత్వంలో అత్యంత దారుణంగా తయారయ్యాని.. రహదారులు వేయిస్తామన్నారు. వైద్యం చాలా ముఖ్యమైనదని.. కొన్ని కొన్ని పూర్తి చేయాల్సి ఉంటుందని మచిలీపట్నం మెడికల్ కాలేజీపై ఎంపీ బాలశౌరి కామెంట్ చేసారు. అలాగే ఎయిమ్స్ సేవలు అందరూ వినియోగించుకోవాలని తెలిపారు. ఆరునెలల్లో కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో నడిపిందని, ఇంకా మరింత అభివృద్ధి చూస్తారని ఎంపీ బాలశౌరి పేర్కొన్నారు.