విజయవాడ ఏ.ఆర్. పోలీసు గ్రౌండ్ లో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ముత్యాల ముగ్గులతో తమలో కళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు మహిళా పోలీసు సిబ్బంది. భోగి మంటలతో సంక్రాంతి వేడుకలను ప్రారంభించిన పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు. ఈ సందర్భంగా సీపీ రాజశేఖర్ బాబు మాట్లాడుతూ.. హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ప్రజల్లో కూడా చాలా మంచి అవగాహన వచ్చిందన్నారు. మీడియా కథనాలు కూడా ప్రజల్లో చైతన్యం తెచ్చింది.. హెల్మెట్ లేక పోవడం వల్లే నిన్న ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోయారు.. సంక్రాంతి పండుగ నుంచి అయినా అందరూ పూర్తిగా హెల్మెట్ లు వాడాలని కోరారు. భవిష్యత్తులో ట్రిపుల్ రైడింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతామని చెప్పారు. ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గించాలనేది తమ లక్ష్యమని పోలీసు కమీషనర్ రాజశేఖర్ బాబు అన్నారు.
Read Also: APCOB: డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా?.. ఏపీ-కో-ఆపరేటివ్ బ్యాంక్ లో జాబ్స్ రెడీ.. నెలకు రూ. 57 వేల జీతం
మీ కుటుంబ సభ్యులను గుర్తు చేసుకుని నిబంధనలు పాటించండి.. డ్రోన్ ద్వారా కూడా ట్రాఫిక్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తామని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు. పోలీసు సిబ్బంది కూడా హెల్మెట్ వాడాలని చెప్పాం.. ఎవరైనా వాడకపోతే వారి పై చర్యలు ఉంటాయన్నారు. మీడియా సభ్యులు కూడా బాధ్యతతో హెల్మెట్ లు వాడాలని విజ్ఞప్తి చేశామన్నారు. సంక్రాంతి రద్దీ నేపధ్యంలో ట్రాఫిక్ ను క్రమబద్దీకరణ చేస్తున్నామని తెలిపారు. పండుగ పేరుతో బెట్టింగ్ లు, కోడి పందాలు ఆడకండని సూచించారు. చాలా చోట్లా కోడి పందాల బరులు పూర్తిగా తొలగించాం.. మరో రెండు రోజులు డ్రైవ్ పెట్టి బరులు తొలగిస్తామని అన్నారు. సంక్రాంతిని సరదాగా జరుపుకోండి… ఆహ్లాదకరంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆనందించండని సీపీ రాజశేఖర్ బాబు పేర్కొన్నారు.
Read Also: Tusli Leave : చలికాలంలో ప్రతిరోజూ తులసి ఆకులను తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా ?