ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాలు, లే అవుట్‌లకు అనుమతులను మున్సిపాలిటీలకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అర్బన్ డెవలప్మెంట్ అధారిటీల నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీలు, గ్రామ పంచాయతీలకు అధికారాలను బదలాయింపు చేసింది ప్రభుత్వం. పాలనాపరమైన సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న నిబంధనల్లో సవరించినట్లు జీవోలో తెలిపింది. ఇకపై అన్ని రకాల భవనాలకు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు అనుమతులు జారీ చేస్తాయి. నగర పంచాయతీల్లో మూడెకరాలు దాటితే డీటీసీపీ అనుమతి తప్పనిసరి.. గ్రామ పంచాయతీలు 300 చ.మీ, 10 మీటర్ల ఎత్తు వరకూ అనుమతులు మంజూరు చేస్తాయి. అనధికారిక కట్టడాలపై మున్సిపల్, కార్పొరేషన్, నగర పంచాయతీలు చర్యలు తీసుకునేలా అధికారాలు బదలాయింపు జరిగింది.