Crude Oil: చౌక ధరకు చమురును దిగుమతి చేసుకోవడంలో భారత దేశం రికార్డు సృష్టిస్తోంది. మే నెలలో భారత దేశం వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్న క్రూడాయిల్‌లో దాదాపు 42 శాతం రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. మే నెలలో రోజుకు సగటున 1.96 మిలియన్ బ్యారళ్ల చమురును ఇంపోర్ట్ చేసుకుందని ఎనర్జీ కార్గో ట్రాకర్ వోర్టెక్సా తెలిపింది. ఇంత పెద్ద మొత్తంలో ఓ దేశం చమురును దిగుమతి చేసుకోవడం ఇదే మొదటిసారి. సౌదీ అరేబియా, ఇరాక్, యూఏఈ, అమెరికాల నుంచి దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురు కన్నా ఎక్కువగా మే నెలలో దిగుమతి చేసుకుంది. ఇది ఏప్రిల్ నెలలో దిగుమతి చేసుకున్నదాని కన్నా 15 శాతం ఎక్కువ.
Read Also: US: AI చాట్‌బాట్‌తో ప్రేమలో పడిన మహిళ.. అక్కడితో ఆగకుండా..!
ఈ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి దిగుమతులు తగ్గుతున్నాయి. సౌదీ అరేబియా నుంచి దిగుమతులను పరిశీలించినపుడు మే నెలలో 5,60,000 టన్నుల చమురును భారత్ దిగుమతి చేసుకుంది. ఇది 2021 ఫిబ్రవరితో పోల్చుకుంటే చాలా తక్కువ. కానీ మే నెలలో మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి కేవలం 39 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది. ఇంత తక్కువ చమురును గతంలో దిగుమతి చేసుకోలేదు. గతంలో భారత్ అవసరాలకు 90 శాతం వరకు ఈ దేశాల నుంచే దిగుమతి చేసుకునేది. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో పాశ్చాత్య దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి. దీంతో రష్యా రాయితీ ధరకు చమురును ఎగుమతి చేస్తోంది. దీని నుంచి భారత్ ప్రయోజనం పొందుతోంది.
Read Also: Mallikarjun Kharge: ప్రమాద హెచ్చరికలను ఎందుకు విస్మరించారు.. ప్రధానికి రాసిన లేఖలో ఖర్గే ప్రశ్న
ఏప్రిల్‌లో రష్యా నుంచి చమురు భారత దేశానికి రావడానికి అన్ని ఖర్చులతో కలుపుకుని ఒక బ్యారెల్ ధర 68.21 డాలర్లు ఉండేది. అదే నెలలో సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒక బ్యారెల్ క్రూడాయిల్ ధర 86.96 డాలర్లు ఉంది. కాగా ఇరాక్ నుంచి వచ్చిన ఒక బ్యారెల్ చమురు ధర 77.77 డాలర్లుగా ఉంది. మే నెలలో క్రూడాయిల్ ధరలు ఇంకా వెల్లడి కాలేదు. రష్యా నుంచి చమురు దిగుమతులను ఐరోపా యూనియన్ డిసెంబరులో నిషేధించింది. దీనిని భర్తీ చేసుకోవడం కోసం రష్యా మన దేశానికి పెద్ద ఎత్తున క్రూడాయిల్‌ను విక్రయిస్తోంది. ప్రస్తుతం దేశ దిగుమతుల్లో రష్యన్ ఆయిల్ వాటా ఏకంగా 42 శాతానికి పెరిగింది. కిందటి నెలలో ఇండియా రోజుకి 47 లక్షల బ్యారెళ్ల ఆయిల్‌ను దిగుమతి చేసుకోగా, ఒపెక్ నుంచి వచ్చిన ఆయిల్ 18 లక్షల బ్యారెళ్లకు తగ్గింది.