ఈసారైనా ఐసీసీ కప్ లు గెలుస్తుందన్న ఇండియా ఆశలు ఆవిరైపోయాయి. వరుసగా రెండుసార్లు ఫైనల్ లో తలబడినా.. కప్ లు సొంతం చేసుకోవడం ఇండియా వల్ల కాలేదు. అయితే ముందునుంచి దూకుడుగా ప్రదర్శించిన ఆస్ట్రేలియా WTC FINALలో విజేతగా నిలిచింది. 209 పరుగుల తేడాతో విక్టరీ అందుకున్న ఆసీస్.. డబ్ల్యూటీసీ టైటిల్ గెలుపొందిన రెండో జట్టుగా రికార్డులకెక్కింది. అయితే నాలుగో రోజు ఆశలు రేపిన టీమిండియా.. ఐదో రోజు కనీసం పోరాడకుండానే చేతులెత్తేసింది. 444 పరుగుల భారీ లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన భారత్.. ఐదో రోజు తొలి సెషన్ లో 63.3 ఓవర్లలో 234 పరుగులకు ఆలౌటైంది. చివరి రోజు టీమిండియా గెలువాలంటే 280 పరుగులు కావాలి. అందుకు ఆస్ట్రేలియా గెలువాలంటే 7 వికెట్లు పడగొట్టాలి. బ్యాటింగ్, బౌలింగ్ బలాబలాల్లో గెలుపు ఆసీస్ నే వరించింది. 3 వికెట్ల నష్టానికి 164 పరుగులతో ఐదో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా బ్యాట్స్ మెన్స్ చేతులెత్తేశారు. మరోవైపు తొలి సెషన్లోనే భారత బ్యాటర్లు విఫలమవ్వడం గమనార్హం.
Read Also: Vikarabad Sireesha Case: మొబైల్ ఫోన్ పరిశీలిస్తే, అసలు నిజం తెలుస్తుంది – శిరీష అక్క
క్రీజులో విరాట్ కోహ్లి, అజింక్య రహానే ఉండటంతో భారత్ విజయంపై ధీమాతో ఉంది. పోరాడితే కనీసం మ్యాచ్ డ్రా అవుతుందని భావించారు. కానీ తొలి గంటలోనే భారత ఓటమి ఖాయమైంది. ఒకే ఓవర్లో విరాట్ కోహ్లి (49), రవీండ్ర జడేజా (0)ను ఔట్ చేసిన స్కాట్ బోలాండ్ భారత్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. అంజిక్య రహానే క్రీజ్‌లో ఉండటం.. ఓవల్‌లో హాఫ్ సెంచరీల హ్యాట్రిక్ సాధించిన శార్దుల్ ఠాకూర్ బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో భారత అభిమానుల్లో ఏదో మూలన ఆశలున్నాయి. కానీ స్టార్క్ బౌలింగ్‌లో రహానే (46) వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. కాసేపటికే శార్దుల్ ఠాకూర్ కూడా డకౌట్‌గా వెనుదిరగడంతో ఆసీస్ విజయం ఖాయమైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్ లియాన్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. స్కాట్ బోలాండ్‌కు మూడు, మిచెల్ స్టార్క్‌కు రెండు వికెట్లు దక్కాయి.
Read Also: IndiGo: పాకిస్తాన్‌లోకి వెళ్లిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానం.. కారణం ఇదే..
ఓవల్ టెస్టులో మొదటగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఓ దశలో 73 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. స్మిత్ (121), ట్రావిస్ హెడ్ (163) భారీ భాగస్వామ్యంతో వారు జట్టును ఆదుకున్నారు. దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 469 పరుగులు చేసింది. అయితే తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు దిగిన భారత్ 296 పరుగులకే ఆలౌట్ అయింది. 71 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన టీమిండియాను జడేజా (48), రహానే (89), శార్దుల్ ఠాకూర్ (51) ఆదుకున్నారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 270/8 వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. దీంతో భారత్ ముందు 444 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. అయితే ఈ భారీ లక్ష్యాన్ని చేధించడంలో టీమిండియా ఘోరంగా తడబడ్డారు. దీనికి ప్రతిఫలంగా ఆసీస్ మ్యాచ్ గెలుపొందారు.