Farming: సేంద్రీయ పద్ధతిలో కూరగాయల సాగు.. ఆదర్శంగా నిలుస్తున్న రైతు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Farming: మనం తినే ఆహార పదార్థాలలో కూరగాయలు కూడా ఒక భాగం. రోజు మనం తినే ఆహారంలోకి ఏదొక కూరను వండుకొని తినక తప్పదు. అందుకోసం మనం కూరగాయల్లో ఎక్కువగా ఫ్రెష్ గా ఉండే కూరగాయలనే ఇష్టపడతాం. మార్కెట్లో కూరగాయలు తాజాగా ఉన్నాయంటే ఇంకో 10 రూపాయలు ఎక్కువైన పెట్టి కొంటాం. అయితే ఇప్పుడున్న కాలంలో కూరగాయలపై రసాయనిక ఎరువులు వాడటం వల్ల.. మనుషులు రోగాలకు గురవుతున్నారు. దీంతో తాజా కూరగాయలు పొందాలంటే కష్టతరంగా మారింది. మరోవైపు చాలామంది రైతులు త్వరగా అధిక దిగుబడి కోసం రసాయనిక ఎరువులు వాడుతున్నారు. పొలంలో ఆవు పేడకు బదులు రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతున్నారు. ఇది మనం తినే కూరగాయలపై తాజాదనం, రుచిని ప్రభావితం చేస్తుంది.
Read Also: Ruhani Sharma: షర్ట్ బటన్స్ విప్పి రుహానీ శర్మ అరాచకం.. తట్టుకోవడం కష్టమే సుమీ!
Also Read
మన దేశంలో సేంద్రీయ పద్ధతిలో పండించే రైతులు కొందరు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు చేస్తున్నారు. వారు పండించిన కూరగాయలు మార్కెట్‌లో వెంటనే అమ్ముడుపోతాయి. అలా సేంద్రీయ పద్ధతిలో కూరగాయలను పండించి ఆదర్శంగా నిలుస్తున్నాడు. బీహార్‌లోని దర్భంగా జిల్లాలో నివసిస్తున్న రైతు మహ్మద్ వాసిం.. తన పొలంలో పచ్చని కూరగాయలు పండిస్తున్నాడు. తన పొలంలో పండించిన కూరగాయలను సమీపంలోని మార్కెట్‌లో విక్రయిస్తుండడంతో మంచి ఆదాయం వస్తోందని అంటున్నాడు. కానీ విపరీతమైన వేడితో పంటల పండక.. దిగుబడిపై ప్రభావం చూపుతోందని తెలుపుతున్నాడు.
Read Also: Rashmika Mandanna: మేనేజర్ దెబ్బకి రష్మిక కీలక నిర్ణయం.. ఇక ఒంటరిగానే?
పంటలు పండించడానికి ముఖ్యంగా నీరు కావాలి. అయితే విపరీతమైన ఎండల కారణంగా భూగర్భ జలాలు బాగా పడిపోయాయని మహ్మద్ వాసీం చెబుతున్నారు. అటువంటి పరిస్థితిలో, కూరగాయలకు నీరు పెట్టేందుకు కష్టమవుతుందని ఆ రైతు అంటున్నాడు. ఉష్ణోగ్రత తీవ్రత కారణంగా కూరగాయల తీగలు ఎండిపోతున్నాయని.. దూరప్రాంతాల నుంచి నీళ్లు తెచ్చి కూరగాయలకు నీరందిస్తున్నట్లు చెపుతున్నాడు. ప్రస్తుతం, మహ్మద్ వసీం కూరగాయల సాగు పెంపకంలో కాకరకాయ, బీరకాయలతో పాటు అనేక రకాల ఆకుకూరలు పండిస్తున్నట్లు తెలిపాడు. కానీ ఇంతకు ముందు కూరగాయల దిగుబడి బాగా ఉండేదని.., ఇప్పుడు ఎండ వేడిమి కారణంగా దిగుబడి తగ్గిందని అంటున్నాడు. అయితే ఇంత జరిగినా అక్కడ మాత్రం కూరగాయలను తక్కువ ధరకే విక్రయిస్తున్నాడు.
తాజావార్తలు
-
Telangana 22A Land List: 22A నిషేధిత జాబితాపై NHRC సీరియస్.. తెలంగాణ సీఎస్‌కు కీలక ఆదేశాలు
-
Kasarla Shyam: “గద్దల నెత్తులు నరికిన కాకుల రాజ్యం”.. ‘ది ప్యారడైజ్’పై కాసర్ల శ్యామ్ గూస్బంప్స్ స్పీచ్!
-
The Paradise : ఏపీలో ‘ది ప్యారడైజ్’ టికెట్ రేట్ల హైక్
-
AP High Court: గ్రూప్-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు.. ఆధారాలు, డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆదేశం
-
US-Iran: ఇరాన్ ఎయిర్‌లైన్స్‌కు అమెరికా భారీ షాక్.. ఎల్లుండి నుంచి ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోనున్న సర్వీసులు!
ట్రెండింగ్
-
Abhishek Anand: ఉద్యోగం చేస్తూనే క్రికెట్.. జపాన్ జాతీయ జట్టుకు చేరిన భారతీయుడు.!
-
India Playing XI: ముగ్గురు స్టార్లకు విశ్రాంతి.. జపాన్‌తో తలపడే భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
32.85 కి.మీ మైలేజీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చేసిన Maruti Suzuki Swift CNG-AMT.. ధర కూడా తక్కువే.!
-
రూ.13.99 లక్షల ప్రారంభ ధరతో Tata Sierra Dark లాంచ్.. వేరియంట్లు, ఫీచర్లు, ధరల పూర్తి లిస్ట్ ఇదిగో..!
-
జమైకా కింగ్స్మెన్కు షాక్.. CPL 2026 ఛాంపియన్‌గా ఆంటిగ్వా అండ్ బార్బుడా ఫాల్కన్స్.!