Yoga: ప్రతి ఏటా జూన్ 21న యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు యోగా ప్రాముఖ్యత ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలిసిపోతుంది. ఎందుకంటే యోగాసనాలు చేస్తే.. శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మానసిక ప్రశాంతత, మనస్సును చురుకుగా చేస్తుంది. ఇప్పుడు ఎక్కువగా జిమ్, వర్కౌట్స్ కంటే యోగాసనాలపైనే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే కొన్ని యోగాసనాలు చేయడం వలన ముఖ్యంగా మానసిక ప్రశాంతత పొందడమే కాకుండా.. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజు ఆ యోగాసనాలు చేయాలని యోగా నిపుణులు తెలుపుతున్నారు. అయితే రేపట్నుంచే ఈ యోగాసనాలను చేయడం మొదలుపెట్టండి.
Read Also: Nidhi Agarwal : టెంప్టింగ్ లుక్ తో రెచ్చగొడుతున్న నిధి అగర్వాల్..
ధనురాసనం.. ముందుగా నేలపై బోర్లా పడుకోవాలి. ఆ తరువాత మీ కాళ్ళను పైకి లేపి, వాటిని తలవైపునకు తీసుకురావాలి. తరువాత, చేతులను వెనుకకు పెట్టి, వాటితో అరికాళ్లను పట్టుకోవాలి. తలను కాస్త పైకి లేపి.. మెల్లగా శ్వాస తీసుకోవడం, వదలడం చేయాలి. అలానే పాదాలు, చేతులను వీలైనంత వరకు పైకి లేపాలి. ఈ ఆసనం చేయడం వల్ల శరీరం, మనస్సు ప్రశాంతంగా ఉంటాయి.
పద్మాసనం.. ఈ యోగాసనం చేయడానికి ముందు నేలపై కూర్చోవాలి. ఎడమ కాలును కుడి కాలుపై ఉంచి.. తుంటి వైపునకు లాగాలి. ఇప్పుడు రెండు చేతులను మోకాళ్లపై ఉంచి, కళ్లు మూసుకుని దీర్ఘ శ్వాస తీసుకోవాలి. ఆ తరువాత మెల్లగా శ్వాసను వదలాలి. ఇలా గాలి పీలుస్తూ, వదులుతూ కాసేపు చేయాలి. ఇలా చేయడం వలన శరీరానికి కొత్త శక్తి అందుతుంది.
Read Also: Heavy Rains: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలపై ప్రభావం
చక్రాసనం.. ముందుగా మీరు వెల్లకిలో పడుకోవాలి. ఆ తరువాత మీ కాళ్ళు, చేతులను వెనకవైపు వంచుతూ.. నడుము భాగాన్ని పైకి లేపాలి. ధనుస్సు ఆకారంలో శరీరం ఉండేలా తీసుకురావాలి. ఆ తర్వాత తలను కిందకు వంచి నేలను చూడాలి. అప్పుడు నెమ్మదిగా ఊపిరి పీల్చుకోవడం, వదలడం చేయాలి. ఈ ఆసనం చేయడం వల్ల మనస్సును ప్రశాంతంగా ఉంచి, ఏకాగ్రతను పెంచేలా చేస్తుంది.
ప్రాణాయామం.. ఈ ఆసనం చేస్తే.. మనస్సు ప్రశాంతంగా, చురుకుగా ఉంటుంది. అంతేకాకుండా ఆలోచనా శక్తి పెరుగుతుంది. మరికొన్ని ఆసనాలు మానసిక ప్రశాంతతను అందిస్తాయి. పశ్చిమోత్తాసనం, బాలాసనం, శీర్షాసనం, వృక్షాసనం వంటి యోగాసనాలు చేస్తే శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యంగా ఉంటారు.