Minister KTR: కరీంనగర్ జిల్లాలో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటించారు. అందులో భాగంగా కరీంనగర్ మున్సిపల్ కార్యాలయంలో వివిధ అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేసారాయన. జిల్లా గ్రంథాలయ భవనంలో డిజిటల్ లైబ్రరీ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంఖుస్థాపన చేశారు. మున్సిపల్ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్, కార్పోరేషన్ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ను మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ ప్రారంభించారు. Read Also: Yash 19: గీతూ మోహన్ దాస్ తో యష్ 19.. […]
మంగళవారం అమెరికా బ్యాట్స్‌మెన్ షాయన్ జహంగీర్ తన సత్తా చూపించాడు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ నేపాల్‌పై కేవలం 79 బంతుల్లో అజేయ సెంచరీ సాధించాడు. అయితే సెంచరీ చేసిన తర్వాత విరాట్ కోహ్లీకి సవాల్ విసిరాడు. మ్యాచ్ అనంతరం ఐసీసీతో జరిగిన ఇంటర్వ్యూలో జహంగీర్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీతో ఒక రోజు ఆడటం తన ఏకైక లక్ష్యమన్నారు.
ఇండిగో విమానం ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో విమాన్యం అత్యవసరంగా ల్యాండ్ అయింది. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి సమాచారం ఇవ్వడంతో బుధవారం డెహ్రాడూన్‌కు వెళ్లే ఇండిగో విమానం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తిరిగి వచ్చింది. విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని, అవసరమైన మెయింటెనెన్స్ ప్రక్రియలు చేపడతామని ఇండిగో సంస్థ తెలిపింది.
హైదరాబాద్‌ను రుతుపవనాలు పలకరించాయి. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టినా.. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో నగరంలోని పలుచోట్ల వర్షం పడుతుంది. నగర వ్యాప్తంగా వర్షం కురుస్తోంది.
సాయంత్రం భట్టి విక్రమార్కకు వైద్య పరీక్షలు నిర్వహించారు వైద్యులు. మరో 24 గంటలు భట్టి విక్రమార్కకు విశ్రాంతి అవసరం అని తెలిపారు. జ్వరం నార్మల్ గా ఉన్నప్పటికీ.. బాగా నీరసంగా ఉన్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఈసీజీ, బిపి, బ్లడ్ టెస్ట్ లు కూడా నార్మల్ గా ఉన్నాయన్నారు. అయితే రేపు క్లినికల్ పరీక్షల తర్వాతే పాదయాత్ర పై నిర్ణయం తీసుకోనున్నట్లు భట్టి సంబంధీకులు చెబుతున్నారు.
ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో ఓ వ్యక్తి బిల్లు కట్టకుండా బయటపడ్డాడు. సరే లే అని వదిలిపెట్టేద్దాం అనుకుంటే.. ఒక్క రోజా రెండు రోజులా ఉండలేదు. దాదాపు 603 రోజులు ఉండి డబ్బులు కట్టకుండానే ఉడాయించాడు. అక్షరాల రూ.58 లక్షల బిల్ ఎగ్గొట్టాడు ఈ చీటర్.
సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు పట్టణ కేంద్రంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భూమిపూజకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రానున్నారు. నాగులపల్లిలో రైల్వే కోచ్ తయారీ కేంద్రం, కొల్లూరులో డబుల్ బెడ్ రూం పనులకు సీఎం శంఖుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందుకు సంబంధించిన పనులను మంత్రి హరీష్ రావు, జిల్లా కలెక్టర్ శరత్, స్ధానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి పరిశీలించారు.
రాజస్థాన్‌లో దారుణం చోటు చేసుకుంది. బికనీర్ లోని ఖజువాలాలో కోచింగ్ తీసుకుంటున్న దళిత బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. మంగళవారం ఉదయం కొత్త ధన్మండి రహదారిపై బాలిక మృతదేహం పడి ఉంది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని.. వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించారు.
పొత్తుపై మాయావతి ఆలోచన చేస్తున్నారా..? ప్రతిపక్ష ఐక్యతపై బీఎస్పీ కన్ను పడిందా?. బీహార్ రాజధాని పాట్నాలో జూన్ 23న ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలో జరగనున్న ప్రతిపక్ష పార్టీల సమావేశంలో బీఎస్పీకి చోటు దక్కలేదు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా అడుగులు వేయాలనుకున్న బీఎస్పీ అధినేత్రి మాయావతి మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. బుధవారం బీఎస్పీ విడుదల చేసిన ప్రెస్ నోట్ ద్వారా విపక్షాల ఐక్యతపై బీఎస్పీ కన్నేసిందని స్పష్టంగా తెలుస్తోంది. ఎస్పీ అధినేత్రి మాయావతి 2024 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ నేతలతో సమావేశమయ్యారు.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రిక్రూట్‌మెంట్ కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ పరీక్షను నిర్వహించింది. ఉత్తరప్రదేశ్ మరియు బీహార్‌లలో ఈ పరీక్ష నిర్వహణ కోసం 21 నగరాల్లో 120 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పరీక్షకు విద్యార్థులు చాలా తక్కువ మంది హాజరయ్యారు. ఈ ఏడాది 40.92 శాతం మంది విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షకు హాజరైనట్లు అధికారులు తెలిపారు.