ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో ఆయనకు కూటమి నేతలు ఘన స్వాగతం పలికారు.. గతంలో అమిత్ షా తిరుపతి పర్యటన సమయంలో చంద్రబాబు బ్యాచ్ రాళ్ల వర్షం కురిపించారని అన్నారు. నచ్చితే కాళ్ళు.. నచ్చకుంటే జుట్టు పట్టుకునే టైప్ రాజకీయ నేత చంద్రబాబని దుయ్యబట్టారు. ఏపీలో అపరిష్కృతంగా అనేక సమస్యలు ఉన్నాయి.. తెలంగాణ నుంచి 8 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి.. కృష్ణా జలాల సమస్య ఉంది.. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు 11,400 కోట్ల ప్యాకేజ్ ఏ లెక్కలో ఇచ్చారో కార్మికులకు కూడా అర్థం కావడం లేదన్నారు. హోంమంత్రి పర్యటన సమయంలో ఇలాంటి అనేక సమస్యలపై మాట్లాడాల్సిందని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
Bhumana Karunakar Reddy: టీటీడీ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా వరుస దురాగతాలు..
పెండింగ్‌లో అనేక సమస్యలు ఉన్న తరుణంలో అమిత్ షాకు బ్రహ్మాండమైన విందు ఇచ్చారట.. ఇలాంటి సమయంలో జగన్‌కు ఉన్న ప్యాలెస్‌ల గురించి ఆయన అడిగారట.. ఈయన చెప్పారట.. బెంగుళూరు, హైదరాబాద్, పులివెందుల ప్యాలెస్‌ల గురించి అమిత్ షా అడిగారని మేమైతే అనుకోమని అంబటి రాంబాబు అన్నారు. అమిత్ షాను మీరు తీసుకువెళ్లిన మీ ఇళ్ళు ఒక అక్రమ కట్టడం.. అది క్విడ్ ప్రోకోలో కాజేసిన ఇళ్ళని అమిత్ షాకు చెప్పాలి కదా అని విమర్శించారు. విశాఖలో అద్భుతంగా కట్టించిన కట్టడాన్ని ఏం చేసుకోవాలో కూడా మంత్రి నారా లోకేష్‌కు అర్థం కావటం లేదట.. మీ హైదరాబాద్ ఇల్లు ఎవరికైనా చూపించారా అని కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో విలాసవంతమైన ఇల్లు కట్టుకుని కనీసం ఎవరికైనా భోజనం పెట్టారా అని దుయ్యబట్టారు. జగన్ క్విడ్ ప్రోకోలో ఎవరి దగ్గర ఇల్లు తీసుకోలేదని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ గురించి మాత్రం మాట్లాడరు.. హోంమంత్రి వస్తే సమస్యల పరిష్కారం కోసం మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చిన అంశాలు మాట్లాడారని పేర్కొన్నారు. అమిత్ షా చెప్పటం వల్లే గతంలో పవన్ కళ్యాణ్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.. ఇవాళ మళ్లీ లోకేష్ ఉప ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నారని అన్నారు. దీనికి అమిత్ షా ఒప్పుకోలేదు.. లోకేష్ లోగుట్టు వ్యవహారాలు కట్టడి చేయాలని చంద్రబాబుకు అమిత్ షా చెప్పినట్లు తమకు సమాచారం ఉందని తెలిపారు.
Viral Video: హనుమాన్ చాలీసా విని కడుపులో ఉన్న బిడ్డ ఏం చేశాడో చూడండి (వీడియో)
తెలంగాణ కృష్ణా నది నీళ్లను మొత్తం వాడుకుంటుంది.. అది చెప్పాలి కదా అని అంబటి రాంబాబు విసుర్లు విసిరారు. పోలవరం ప్రాజెక్టు డయాఫ్రమ్ వాల్ పోవటానికి చంద్రబాబు అవివేకమే కారణమని పేర్కొ్న్నారు. జగన్ మీద బురద చల్లే ప్రయత్నం మరోసారి చేస్తున్నారు.. పనులు చేసే ప్రతీసారి జగన్ తప్పిదం అని చెప్పటం సరికాదని తెలిపారు. ప్రకృతి విపత్తులు జరిగితే ఎన్డీఆర్ఎఫ్ వస్తుంది.. మాన్ మేడ్ డిజాస్టర్ వస్తే ఎన్డీఏ వస్తుందన్నారు.. మరీ తిరుపతి రాలేదే అని వ్యాఖ్యానించారు. టీటీడీ మీద అసలు కంట్రోల్ మొత్తం పోయింది.. లడ్డూ మీద, వైసీపీ మీద చేసిన ఆరోపణల వల్లే ఇలా జరిగిందని అన్నారు. కూటమి ప్రభుత్వం అసమర్థ పాలన చేస్తుంది.. ఏదేదో మాట్లాడుతున్న చంద్రబాబు అందరి బుర్ర పాడు చేస్తున్నారని మండిపడ్డారు. ఇద్దరు పిల్లల్ని కనాలని చెబుతున్న చంద్రబాబు.. ఆయన కొడుకు మాత్రం ఒక్కరినే కన్నారని ఆరోపించారు. ఒక్క కాన్పుకు లక్షలు అవుతున్నాయి.. సామాన్యులు భరించలేకపోతున్నారని అన్నారు. కొందరు పారిశ్రామికవేత్తలు జగన్ రాడని గ్యారంటీ అడుగుతున్నారు అంటే ఈసారి మీరు రారని వాళ్లకు అర్థం అయ్యిందని తెలిపారు. జగన్ వచ్చాకే మేము పెట్టుబడులు పెడతాం అని వాళ్ళు చెబుతున్నారు.. దావోస్ ఏ సీఎం వచ్చినా వెళ్తారు.. ఎన్ని పెట్టుబడులు తీసుకువస్తారో చూద్దామని అంబటి రాంబాబు విమర్శించారు.