జనసేన పార్టీ క్రియా శీలక సభ్యత్వం చేయించుకొని ప్రమాదవశాత్తు మృతి చెందిన క్రియాశీలక మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు బకాయి పెట్టి వెళ్ళిపోయిన ప్రభుత్వం ఒక్క వైసీపీ మాత్రమేనని ఆరోపించారు. సూపర్ సిక్స్ హామీలో భాగంగా ఉచిత గ్యాస్‌కు అధిక ప్రాధాన్యత ఇచ్చాం.. తల్లికి వందనం త్వరలోనే అమలు చేయబోతున్నామని తెలిపారు. పవన్ కళ్యాణ్ తనకు అప్పగించిన బాధ్యత నిర్వర్తిస్తూ సమర్ధవంతంగా ముందుకు వెళ్తున్నారని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్ కేసులో కీలక విషయం..రూ. కోటి డిమాండ్..
సోషల్ మీడియాలో కొంతమంది చేసే దుష్ప్రచారం ఎవరు నమ్మకండి.. జనసేన కార్యకర్తలకు, వారి కుటుంబ సభ్యులకు పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని మంత్రి నాదెండ్ల చెప్పారు. పార్టీ తరపున క్రియాశీలక సభ్యత్వ నమోదు నిజాయితీగా చేస్తున్నాం.. 92 వేలతో మొదలైన సభ్యత్వాలు ఇపుడు 11లక్షల 92 వేలకు చేరుకుందని అన్నారు. పార్టీని ప్రారంభించినప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నారు.. గతంలో రైతులు, కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న వారికి పవన్ కళ్యాణ్ సొంత డబ్బు అందించారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 980 మంది జనసైనికులను కోల్పోయాం.. వారందరికీ పార్టీ అండగా నిలబడిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
Read Also: SS Thaman: మహేష్ బాబు ఫాన్స్ కి థమన్ మార్క్ కిక్కు..