భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు.
రాజస్థాన్‌లోని భిల్వారాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగ్ లోంచి వాటర్ బాటిల్ తీసి అందులో మూత్రం పోశాడు మరో విద్యార్థి. అంతేకాకుండా విద్యార్థిని బ్యాగ్‌లో ప్రేమ లేఖను కూడా పెట్టాడు.
ఫోన్తోనే ఎక్కువ టైం గడిపేస్తున్నారా.. పక్కన ఉండే మీ భాగస్వామిని పట్టించుకోవడం లేదా..!. ఈ అలవాటును మానుకోండి.. లేదంటే మీ రిలేషన్ షిప్ లో సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
యూకేలో చెక్క దిమ్మెలతో తయారుచేసిన అత్యంత ఎత్తైన టవర్ ను కూల్చివేసిన వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.
30 అడుగుల ఎత్తులో ఉన్న వ్యక్తిని వీల్‌చైర్‌లో ఉన్న వృద్ధుడు కింద పడేశాడు. దీంతో ఆ వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో అతని పరిస్థితి లేవలేకుండా అయిపోయింది. వృద్ధుడు వీల్‌ఛైర్‌లో మెట్ల దగ్గరికి వచ్చి ఆగినట్లు చూడవచ్చు. ఆ తర్వాత అతను అక్కడ వేసిన నిచ్చెనను బలంగా కదిలిస్తాడు.
SRH టీమ్.. కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గత సీజన్‌లో పేలవ ప్రదర్శన చూపిన కొంతమంది ఆటగాళ్లపై వేటు వేయాలని చూస్తోంది. గత సీజన్ లో రూ.13.25 కోట్లు ఖర్చు పెట్టి.. కొనుగోలు చేసిన ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
గత కొన్నిరోజులుగా గాయంతో బాధపడుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తాజా అప్‌డేట్ వచ్చింది. అతను బౌలింగ్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు భారత క్రికెట్‌కు మంచి సంకేతాలు ఇస్తోంది.
కొన్ని ఎద్దులు మనుషులను చూడటంతోనే చిర్రెత్తిపోతాయి. వాటికి ఏమనిపిస్తుందో ఏమో తెలియదు కానీ.. ఉరకలేసుకుంటూ వస్తూ.. మీద పడుతాయి. ఇక్కడ కూడా అలాంటి ఘటనే జరిగింది. ఓ వ్యక్తిపై అక్కడే ఉన్న ఎద్దు దాడి చేసింది. భయంతో ఎద్దు దాడి నుంచి తప్పించుకునేందుకు పరుగెత్తుకుంటూ వెళ్లి సమీపంలో ఉన్న చెట్టు ఎక్కాడు. అయినప్పటికీ ఆ ఎద్దు అతన్ని వదలకుండా ఆ చెట్టు చుట్టూ తిరుగుతూ కోపంతో ఊగిపోయింది.
పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ని అంగడిలో సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నెల్లూరులో రొట్టెల పండుగకు వచ్చిన గుంటూరుకు చెందిన ఇద్దరు మహిళలు మృతి చెందారు. పండుగను తిలకించిన వారు తిరిగి తమ స్వస్థలానికి వెళ్లేందుకు.. రైల్వే స్టేషన్ కు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.