ఇండియాలో అత్యధికంగా పన్ను చెల్లించేవారిలో స్టార్ హీరోలు, హీరోయిన్లు కూడా ఉన్నారు. చాలా మంది ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, రతన్ టాటా లాంటి పారిశ్రామిక వేత్తలు చెల్లిస్తారని అనుకుంటారు. కానీ వారిని మించి.. ఓ బాలీవుడ్ స్టార్ హీరో పన్ను చెల్లిస్తాడు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసుకుందాం.
Spark L.I.F.E: పాన్ ఇండియా లెవల్లో ‘స్పార్క్L.I.F.E’.. ఆగస్ట్ 2న టీజర్
భారతదేశంలో అత్యధికంగా పన్ను చెల్లిస్తున్న వారిలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ పేరు వినిపిస్తోంది. ఏంటీ అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడం ఏంటా అని సందేహం కలగవచ్చు. ఆదాయపు పన్ను శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. అక్షయ్ కుమార్ గత సంవత్సరం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇండియాలో అత్యధిక పన్ను చెల్లింపుదారుగా ఉన్నారు. అతని నుంచి రూ. 29.5 కోట్ల ఆదాయపు పన్ను జమ అయింది. మరోవైపు ఈ ఏడాది తన ఆదాయం రూ.486 కోట్లు ఉందని తెలిపాడు.
TTD: అధిక మాసం ఎఫెక్ట్.. టీటీడీ కీలక నిర్ణయం
అక్షయ్ కుమార్ అత్యధికంగా పన్ను చెల్లించడానికి కారణమేంటంటే.. బాలీవుడ్ లో అతిపెద్ద స్టార్లలో ఒకరు, అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకరు. అక్షయ్ కుమార్ ఏడాదికి దాదాపు 4-5 సినిమాలు నటిస్తున్నారు. అంతే కాకుండా.. అక్షయ్ కుమార్ తన సొంత ప్రొడక్షన్ హౌస్, స్పోర్ట్స్ టీమ్‌ను నడుపుతున్నారు. అతను వివిధ బ్రాండ్‌లను ఎండార్స్ చేయడం ద్వారా చాలా సంపాదిస్తాడు. అందుకోసం ఆయన ఎక్కువగా చెల్లిస్తున్నాడు. 2022కి ముందు కూడా అత్యధిక ఆదాయపు పన్ను చెల్లించాడు.
CM KCR: రేపు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్.. షెడ్యూల్ ఇదే..!
మరోవైపు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ లేదా రతన్ టాటా లాంటి వ్యక్తులు.. పన్ను చెల్లింపుదారులలో అగ్రగామిగా ఎందుకు లేరనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది. అయితే వ్యవస్థాపకులు వ్యక్తిగత ఆస్తులను కలిగి ఉండరు, కానీ వారి కంపెనీల పేరుతో ఆస్తులను కలిగి ఉండటం వల్ల ఆదాయాలు వారి కంపెనీలకు వెళ్తాయి. దానికి బదులుగా కార్పొరేట్ ఆదాయపు పన్ను చెల్లిస్తారు.
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేయడానికి గడువు జూలై 31తో ముగుస్తుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటివరకు 6 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఆదివారం వెల్లడించింది.