పవన్ కళ్యాణ్ పై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి తీవ్ర దుమారం రేపాయి. పవన్ కళ్యాణ్ ని అంగడిలో సరుకు అనడంతో జనసైనికులు సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘బ్రో’ సినిమాలో శ్యాంబాబు పాత్ర మంత్రి అంబటి రాంబాబుని బాగానే ఇబ్బందికి గురిచేసినట్టుంది. సినిమా విడుదలైన తర్వాత ట్వీట్ చేశారు. ఆ తర్వాత ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి మరీ వివరణ ఇచ్చిన మంత్రి రాంబాబు.. తాజాగా పవన్ కల్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. పవన్ అంగడి సరుకు అని, ప్యాకేజీ స్టార్ ని ఎవరైనా ఆయన్ను కొనుక్కోవచ్చని దుయ్యబట్టారు.
Dil Raju: బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా దిల్ రాజు ఘన విజయం
“అంగట్లో సరుకు, అమ్మడు పోవడానికి సిద్ధంగా ఉన్న సినిమా నటుడు. ఎవరు కావాలంటే వారు కొనుక్కోవచ్చు అని పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. బీజేపీ వాళ్లు కొనుక్కోవచ్చు, టీడీపీ వాళ్లు కొనుక్కోవచ్చు, ఆ మధ్య బీఆర్ఎస్ కూడా బేరం ఆడిందట అని సెటైరికల్ కామెంట్స్ చేశారు. ఆయన్ను కొనుక్కుని, ఆయన భుజాలపై ఎక్కి చంద్రబాబు, లోకేష్ ఎన్నికలకు రావాలనుకుంటున్నారని ఆరోపించారు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త..” అంటూ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి కలకం రేపాయి.
Sai Rajesh: చిరంజీవికి ఆ అదృష్టం లేదు.. ‘బేబీ’ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు
మంచి చేస్తేనే.. ఓటు వేయండి అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్ తప్ప మరెవరూ లేరని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బీసీలకు పిలిచి పదవులు ఇస్తున్న ముఖ్యమంత్రి జగన్ అని కొనియాడారు. అంతేకాకుండా సత్తెనపల్లిలో తన విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. లోకేష్ టీడీపీకి శని అని.. టీడీపీ వాళ్ళు అది తెలుసుకోవాలని మంత్రి అంబటి ఆరోపించారు.