గుంటూరు తూర్పు టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భగత్ సింగ్ జయంతి సందర్భంగా 1వ వార్డులో బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు స్థానిక టీడీపీ మహిళా నేతలు.. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరయ్యారు. అయితే.. వార్డులో కార్యక్రమాలు నిర్వహించే సమయంలో స్థానిక నాయకులకు సమాచారం ఇవ్వడం లేదంటూ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్‌ను అడ్డుకున్నారు టీడీపీ డివిజన్ స్థాయి నాయకులు.
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు.
ఐసీసీ అండర్ 19 టీ20 (ICC U19 T20) మహిళల ప్రపంచ కప్‌లో భారత్ సూపర్ సిక్స్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ 60 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది.
విశాఖలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిధిగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. వుడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆధ్వర్యంలో భారీగా మంత్రి లోకేష్ జన్మదిన వేడుకలు చేశారు.
ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. వచ్చే నెల (ఫిబ్రవరి 6) న ఈ భేటీ జరగనుంది. ఈ కేబినెట్ భేటీలో వచ్చే బడ్జెట్ సమావేశాలపై చర్చించనున్నారు. త్వరలో ప్రారంభించే సంక్షేమ పథకాలపై కూడా కేబినెట్‌లో చర్చ జరగనుంది.
రాష్ట్రంలో మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ స్థాపించనున్నట్లు జేఎస్‌డబ్ల్యూ సంస్థ ప్రకటించింది. అమెరికాకు చెందిన డిఫెన్స్ టెక్నాలజీ సంస్థ అనుబంధంతో ఈ యూనిట్ నెలకొల్పనుంది. దాదాపు రూ.800 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.
అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్ వార్తపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఆగ్రహం చేసింది. బాధ్యులైన వైద్యులపై చర్యలకు రంగం సిద్ధం చేసింది. అక్రమ కిడ్నీ రాకెట్ మార్పిడిపై తెలంగాణ వైద్య మండలి స్పందించి సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (TGMC) ప్రకటించింది.
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా.. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ముందుకొచ్చింది.
ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ఆర్టీసీ డిపోల ప్రైవేటీకరణ ప్రయత్నాలంటూ జరుగుతున్న ప్రచారాన్ని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ఈ ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోలు ప్రైవేట్ సంస్థల పరిధిలోకి వెళ్లిపోతున్నాయనే దుష్ప్రచారం పూర్తి అవాస్తవమని పేర్కొంది.