Davos Tour: సన్ పెట్రో కెమికల్స్ సంస్థతో తెలంగాణ ప్రభుత్వం భారీ ఒప్పందం.. 7,000 మందికి ఉద్యోగాలు
- దావోస్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో తెలంగాణకురీ పెట్టుబడులు
- తెలంగాణలో సన్ పెట్రోకెమికల్స్ భారీ పెట్టుబడులు
- రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ సంస్థ ఒప్పందం
- రాష్ట్రంలో సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయనున్న సంస్థ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాష్ట్రంలో పెట్టుబడుల కోసం తెలంగాణ రైజింగ్ బృందం దావోస్ ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సులో వరస భేటీలు, చర్చలు జరుపుతోంది. అందులో భాగంగా.. తెలంగాణలో భారీ పంప్డ్ స్టోరేజీ పవర్, సోలార్ పవర్ ప్రాజెక్టు కోసం సన్ పెట్రో కెమికల్స్ సంస్థ ముందుకొచ్చింది. రూ.45,500 కోట్ల పెట్టుబడులకు సన్ పెట్రోకెమికల్స్ సంస్థతో రాష్ట్ర ప్రభుత్వం ఎంఓయూ చేసుకుంది. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సులో తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పెట్టుబడిని సాధించింది.
Read Also: Bengaluru S*x assault: మహిళపై అత్యాచార ఘటనలో ఇద్దరు కూలీలు అరెస్ట్.. అసలేం జరిగిందంటే..!
Also Read
సన్ పెట్రో కెమికల్స్ సంస్థ రాష్ట్రంలో రూ.45,500 కోట్ల పెట్టుబడుల ఒప్పందంపై సంతకం చేసింది. రాష్ట్రంలో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్తు, సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ఒప్పందంతో దాదాపు 7,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. నాగర్ కర్నూల్, మంచిర్యాల, ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులు నెలకొల్పనుంది. ఇప్పటివరకు దావోస్ వేదికగా తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న భారీ ఒప్పందం ఇదే.
Read Also: CM Chandrababu: మూడో రోజు కీలక సమావేశాలు.. బిల్‌గేట్స్‌తో చంద్రబాబు భేటీ..
మరో కీలక ఒప్పందం
దావోస్‌లో మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో అధునాతన అన్‌మాన్డ్ ఏరియల్ సిస్టమ్స్ (UAV) తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. రూ.800 కోట్లతో ఏర్పాటు చేయనున్నట్లు జేఎస్ డబ్ల్యూ ప్రకటించింది. జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ అనుబంధ సంస్థ అయిన JSW UAV లిమిటెడ్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ ప్రాజెక్టుతో డ్రోన్ టెక్నాలజీకి తెలంగాణ ప్రధాన కేంద్రంగా మారే అవకాశముంది.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!