విజయసాయిరెడ్డి రాజీనామాపై హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయినా, తప్పు చేసిన వాళ్లు శిక్ష అనుభవించాల్సిందేనని అన్నారు. విజయసాయి రెడ్డికి కలలోకి గొడ్డలి వచ్చిందేమో, అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని హోంమంత్రి సెటైర్లు వేశారు.
ఇండియా 76వ గణతంత్ర దినోత్సవం జరుపుకోనుంది. దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సంబరాలు ఘనంగా జరగనున్నాయి. మరోవైపు.. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది.
విజయసాయిరెడ్డి రాజీనామాపై టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయసాయి రెడ్డి పాపాలన్నీ చేసేసి ఇప్పుడు రాజీనామాతో రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించడం విచిత్రంగా ఉందని ఎక్స్ లో పేర్కొన్నారు.
విజయసాయి రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వస్తోందని తెలిపారు.
కారుకు మీడియా సంస్థ పేరు స్టిక్కర్ పెట్టుకొని గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముగ్గురు నిందితులను అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా వివరాలు వెల్లడించారు. నర్సీపట్నం శివారులో వాహన తనిఖీలు చేస్తుండగా.. కారులో అక్రమంగా తరలిస్తున్న 205 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
జనసేన పార్టీ ప్లీనరీ సమావేశాలు నిర్వహించాలని పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్ణయించారు. జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని 3 రోజులపాటు ప్లీనరీ జరపాలని నిర్ణయించారు.
విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఈవెంట్ కోసం జరుగుతున్న ఏర్పాట్లను సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పరిశీలించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. ఫిబ్రవరి 15న నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై భువనేశ్వరి పోలీసులతో చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసానికి చేరుకున్నారు. అంతకుముందు.. ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చారు.