AP Fiber Net: ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కీలక నిర్ణయం.. త్వరలోనే సంస్థ విస్తరణ..!
- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం
- ఫైబర్ నెట్ లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం- జీవీ రెడ్డి
- త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నాం- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్
- సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యో గాలు ఇస్తాం- జీవీ రెడ్డి
- ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తాం
- త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయి- ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫైబర్ నెట్‌లో ఇప్పటి వరకు 600 మందిని తొలగించాం.. త్వరలోనే సంస్థ విస్తరణ చేయనున్నామని తెలిపారు. సంస్థలో తొలగించిన వారి స్థానంలో మళ్ళీ ఉద్యోగాలు ఇస్తామని అన్నారు. ఈసారి రాజకీయ కొలువులు మాదిరి కాకుండా పారదర్శకంగా చేస్తామని చెప్పారు. త్వరలోనే సంస్థలో నియామకాలు ఉంటాయన్నారు. కేబుల్ ఆపరేటర్ల మీద గత ప్రభుత్వ హయంలో రూ.100 కోట్లు జరిమానా వేశారు.. ఇదంతా కక్ష పూరితంగా జరిగిందని ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. దీనిపై విచారణ జరిపి అడ్డగోలుగా వేసిన జరిమానాలను రద్దు చేయాలని నిర్ణయించామని జీవీ రెడ్డి తెలిపారు.
Read Also: Skoda SUV Kylaq: రూ. 7.89 లక్షల విలువైన స్కోడా ఎస్‌యూవీ.. బ్రెజ్జా కంటే ఎక్కువ మైలేజీ!
Also Read
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- Kadapa Murdered: కడపలో దారుణ హత్య.. మహిళను కడతేర్చి ప్రియుడు.. ఆపై ఆత్మహత్యాయత్నం!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
కేబుల్ ఆపరేటర్లు నుంచి కనెక్షన్ల నుంచి రెంట్ వసూలు చేశారు.. ఈ కనెక్షన్ల మీద వసూలు చేసిన రెంట్లు రద్దు చేయాలని నిర్ణయించామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పేర్కొన్నారు. బినామీలతో అడ్డగోలుగా కాంట్రాక్టులు గత ప్రభుత్వ హయంలో అప్పజెప్పారు.. రూపాయికి 10 రూపాయలు చెల్లింపులు జరిగాయని ఆరోపించారు. ఇప్పటి వరకు ఉద్యోగాలను తొలగించినా.. ఒక్కరు కూడా వచ్చి అడిగిన పరిస్థితి లేదని తెలిపారు. దీన్ని బట్టే అన్నీ గతంలో నిబంధనలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయనేది స్పష్టం అయిందని అన్నారు.
Read Also: Karnataka: “భారతమాత హిందువులకు మాత్రమే దేవత”.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రంలో కొత్త వివాదం..
ఫైబర్ నెట్ ప్లాన్స్ కూడా రివైజ్ చేస్తాం.. గ్రామాల్లో అందరికీ తక్కువ ధరకు ఇవ్వాలనే బేసిక్ ప్యాకేజ్ అందుబాటులోకి తెస్తామని జీవీ రెడ్డి తెలిపారు. టీటీడీ దేవస్థానం మీద ఉచిత కనెక్షన్లు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం.. టీటీడీ ప్రతిపాదనలు ఇస్తే తాము ఉచితంగా ఇవ్వటానికి సిద్ధమని అన్నారు. వివిధ రకాల మార్గాల్లో పెట్టుబడులు సేకరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం.. 2 నెలల్లో రుణాలు తీసుకుని సంస్థ విస్తరణ చేస్తామని ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!