విశాఖలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్ కేసులో పోలీసులు స్పీడ్ పెంచారు. ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు. అందుకోసం 3 వింగ్స్ ఏర్పాటు చేశారు. టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా బుకీలా వివరాలు కనుకుంటున్నారు పోలీసులు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి విమానాశ్రయంలో ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న నూతన టెర్మినల్ భవనంలో కొంత భాగం కుప్ప కూలింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కార్మికులు కొంత దూరంగా ఉండటంతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే ప్రమాదానికి సంబంధించి ఎలా జరిందనే దానిపై అధికారులు విచారణ చేపట్టారు.
ఈరోజు సాయంత్రం 4 గంటలకు సీఎం చంద్రబాబు రాష్ట్రానికి రానున్నారు. దావోస్ పర్యటన తర్వాత ఈరోజు అర్ధరాత్రి ఢిల్లీకి వచ్చిన సీఎం చంద్రబాబు.. ఢిల్లీ నుంచి సాయంత్రం 4 గంటలకు అమరావతి చేరుకోనున్నారు. అనంతరం.. సాయంత్రం అందుబాటులో ఉన్న మంత్రులతో చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించనున్నారు.
చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎవరు రావడం లేదని ఆరోపించారు. ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టి వేదిస్తే పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువయ్యాయి... ఇలాంటి రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడుతారని అన్నారు.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీశాఖలో సమగ్ర మార్పుల మీద దృష్టి సారించారు. రాష్ట్ర అటవీశాఖకు ఎదురవుతున్న సవాళ్లను, శాఖాపరంగా ఉన్న సమస్యలను పరిష్కరిస్తూ ప్రాధాన్య క్రమంలో మార్పులు తీసుకురానున్నారు. దశాబ్దాలుగా అటవీ శాఖలో ఉన్న సమస్యలు, పరిష్కారం మార్గాలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని శాఖ పి.సి.సి.ఎఫ్, హెచ్.ఓ.ఎఫ్.ఎఫ్.ను ఆదేశించారు.
సీఎం చంద్రబాబు నాయుడు దావోస్ పర్యటన పై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దావోస్ పర్యటనతో రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్ట్ అయినా వచ్చిందా..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు బృందం దావోస్ పర్యటనపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురాలేదని కూటమి ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తుందని ఆరోపించారు.
వచ్చే ఏడాది ఆర్ధిక బడ్జెట్‌పై ఏపీ ప్రభుత్వం కసరత్తు దాదాపు పూర్తయింది. ఆయా శాఖలు ప్రతిపాదనలు ఆర్ధిక శాఖకు అందించే పనిలో ఉన్నాయి. గత బడ్జెట్‌ల కంటే భిన్నంగా కూటమి సర్కార్ బడ్జెట్ ప్రవేశ పెట్టె ఆలోచనలో ఉంది. సంక్షేమం, అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఇవ్వాలని కుటమి సర్కార్ భావిస్తోంది.
కేరింగ్ క్రాస్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ బోరో డ్రోపులిక్‌తో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ దావోస్ బెల్వడేర్‌లో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో బసవతారకం క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌తో కలిసి జన్యుచికిత్స, అత్యాధునిక ఆరోగ్యసంరక్షణ మౌలిక సదుపాయాల్లో భాగస్వామ్యం వహించాలన్నారు లోకేష్.