ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్‌తో భేటీ అయ్యారు. ఉదయం మంగళగిరి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారు.. పవన్ కల్యాణ్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఇరుదేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు, ప్రజల సహకార, సంయుక్త అభివృద్ధి, అవకాశాలను అన్వేషించే మార్గాలు తదితర అంశాలపై చర్చించారు.
Read Also: Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఆటో డ్రైవర్‌కు కాసుల వర్షం
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ అనంతరం.. సింగపూర్ దౌత్య కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని పేర్కొంది. సింగపూర్-ఆంధ్రప్రదేశ్ మధ్య సుదీర్ఘ మైత్రి ఉందని పేర్కొంది. ఏపీ-సింగపూర్ సంబంధాల బలోపేతం దిశగా ఈ భేటీ జరగడం అభినందనీయమని సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్ తెలిపారు.
ఈరోజు ఉదయం ఉప ముఖ్యమంత్రి @PawanKalyan తో సింగపూర్ కాన్సుల్ జనరల్ శ్రీ ఎడ్గర్ పాంగ్, కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ రోజు ఉదయం క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఇరు దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలపై, ప్రజల సహకారం, సంయుక్త అభివృద్ధి అంశాలపై చర్చించారు… pic.twitter.com/bQ6X4QnQXH
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) January 23, 2025
Read Also: Dog Attack: దారుణం.. వృద్ధురాలిపై వీధి కుక్కల గుంపు దాడి..